కొత్త డైరెక్టర్‌తో చెట్టా పట్టాలేసుకు తిరుగుతున్న హీరోయిన్
మిచెల్లీ విలియమ్స్ నెమ్మది మృదు స్వభావం గల ఆమె. త్వరగా వార్తల్లోకి రాని వ్యక్తి. అలాంటి మిచెల్లీ విలియమ్స్ కొత్తగా తన కొత్త డైరెక్టెర్‌తో పబ్లిక్‌లో కనపడే సరికే వీరిద్దరి మద్య హాలీవుడ్ మీడియో సంబంధం అంటగట్టేసింది. బ్రూక్లైన్‌లో ఉన్న మిచెల్లీ విలియమ్స్ ఇంటి దగ్గర ఇద్దరూ వాకింగ్ చేస్తూ మీడియాకి అడ్డంగా దోరికి పోయారు. 2008-2009 సంవత్సరంలో డైరెక్టర్ స్పైక్ జోన్జ్ తో ప్రేమ కాలాపాలు నడిపిన తర్వాత మిచెల్లీ విలియమ్స్ ఆ తర్వాత పెద్దగా ఎక్కడా పబ్లిక్ అప్పీరియన్స్ లేదనే చెప్పాలి.
అలాంటది ఎన్నడూ లేని మిచెల్లీ విలియమ్స్ తన కొత్త బాయ్ ప్రెండ్, డైరెక్టర్ క్యారీ పుకునాగాతో ఇలా డైరెక్టుగా బయట కనిపించింది. క్యారీ పుకునాగాతో వాకింగ్‌కి వచ్చిన సమయంలో మిచెల్లీ తన కూతురు మాడిట్లాని కూడా విహారానికి తీసుకోని రావడం చర్చనియాంశం అయింది. ఇక మిచెల్లీ విషయానికి వస్తే తను ప్రస్తుతం మార్లిన్ మన్రో జీవితం గురించి తీస్తున్నటువంటి సినిమాలో ఓ కీలకమైన రోల్ పోషిస్తున్నారు. గతంలో మిచెల్లీ విలియమ్స్ ఆస్కార్ అవార్డుకి నామినేట్ కావడం కూడా జరిగింది.
ఇక మార్లిన్ మన్రో గా నోమి వాట్స్ మట్లాడుతూ మార్లిన్ మన్రో పాత్ర చేయాలంటే నాకు చాలా భయంగా ఉందని తన మనసులోని భావాలను పంచుకున్నారు. మార్లిన్ మన్రో పాత్రలో ఇమిడిపోయి నటించాలంటే చాలా ధైర్యంకావాలని అన్నారు. దీనికి కారణం ప్రపంచం మొత్తం మీద మార్లిన్ మన్రో అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా మార్లిన్ మన్రో స్టయిల్‌ని కూడా ఇమిటేట్ చేయాలంట్ చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు.


Click it and Unblock the Notifications











