బిగ్‌బాస్-5లో హెవీ వెయిట్ బాక్సర్ మైఖ్ టైసన్?
అక్టోబర్‌లో ప్రారంభం కానున్న రియాలిటి టివి షో బిగ్‌బాస్-5లో అమెరికా హెవీ వెయిట్ బాక్సర్ మైఖ్ టైసన్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు బిగ్‌బాస్ నిర్మాతలు అతడితో చర్చలు జరుపుతున్నారు. ఈ షోలో పాల్గొనాల్సిందిగా మారియా సుషరురాజ్, క్రికెటర్ నవజ్యోత్ సిద్ధూ, భారత మోడల్ పూనమ్ పాండేలను నిర్వాహకులు సంప్రదించారు. పూనమ్‌కు 2 కోట్ల ఇవ్వడానికి సిద్దపడ్డారు. మారియా ఇందులో పాల్గొనడానికి ఒప్పుకోలేదు. టైసన్ అంతర్జాతీయ సెలబ్రిటీ కావడంతో అతడు ఈ షోలో పాల్గొంటే పిల్లలు, పెద్దలు ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని చూస్తారని ముంబై మిర్రర్ పత్రిక పేర్కొంది. గత బిగ్‌బాస్ షోలో భారత రెజర్లర్ గ్రేట్ ఖాళీ పాల్గొన్నాడు. మైఖ్ టైసన్‌కు బ్యాడ్ బాయ్‌గా పేరుంది. ఈ షో ఆరంభ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లు హాజరవుతారు.
More from Filmibeat
hollywood bollywood mike tyson bigboss 5 salman khan హాలీవుడ్ బాలీవుడ్ మైఖ్ టైసన్ బిగ్‌బాస్ 5 సల్మాన్ ఖాన్


Click it and Unblock the Notifications











