అటువంటి వాటిని పెద్ద సీరియస్ గా తీసుకోనంటున్న హీరోయిన్
ఇటీవల హాలీవుడ్ లో శుక్రవారం జరిగినటువంటి ఛాయిస్ మూవీ అవార్డ్సు కార్యక్రమానికి సాదాసీదాగా వచ్చినటువంటి మిలా కునిస్ ని ఏంటీ అవార్డుల కార్యక్రమానికి ఇలా వచ్చారు అని జర్నలిస్ట్ అడడగా దానికి సమాధానంగా మిలా కునిస్ సాధారణంగా అవార్డుల కార్యక్రమాలను పెద్ద సీరియస్ గా తీసుకోనని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈసందర్బంలో మిలా కునిస్ మాట్లాడుతూ కేవలం అవి అవార్డ్స్ మాత్రమేనని తేలికగా కోట్టిపారేశారు. ఈఅవార్డుల కార్యక్రమమేమి ప్రపంచం అంతానికి చివరకాదని అన్నారు.
అందుకే ప్రజలు చాలా రిలాక్స్ గా ఉండాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. బ్లాక్ స్వాన్ అనే సినిమాలో నటించినటువంటి నటనకు గాను మిలా కునిస్ బెస్ట్ సపోర్టింగ్ హీరోయిన్‌గా నామినేట్ అయ్యారు. అందుకే మిలా కునిస్ ను రెడ్ కార్పెట్ మీదకు ఆహ్వానించడం జరిగింది. కానీ మిలా కునిస్ మాత్రం రెడ్ కార్పెట్ ను సద్వినియోగ పరుచుకోలేక పోయిందని అక్కడికి వచ్చిన వారంతా అనకున్నారు. వారంతా అలా అనుకోవడానికి కారణం మిలా కునిస్ సాధారణ డ్రస్సు ధరించి అక్కడకి రావడమే. ఎవరికైనా రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించే చాన్సు వస్తే మాత్రం మంచి మంచి అందమైన డ్రస్సులు ధరించి వాళ్శ కున్న అందాలను ఆరబోయడం జరుగుతుంది.
దీనిపై స్పందించినటువంటి మిలా కునస్ మాత్రం దీనిని తేలికగా కొట్టిపారేశారు. నేను ఎటువంటి ప్లాను లేకుండా ఇక్కడికి రావడం జరిగింది. దానికి కారణం నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అని అన్నారు. ఇంతకీ మిలా కునిస్ వేసుకొచ్చినటువంటి బ్లాక్ డ్రస్సు మాత్రం ఫరవాలేదని అనిపించిందని మరికొంత మంది అనడం జరిగింది.


Click it and Unblock the Notifications











