రాత్రంతా త్రాగి మీడియాకు చిక్కిన హీరోయిన్
బిగ్ ఫిష్, సెక్స్ అండ్ సిటీ చిత్రాల్లో నటించిన మైలే సైరస్ ఇప్పుడు హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. త్రాగటం అనేది అక్కడ కామన్ అయినా ఊరు పేరు లేని నైట్ క్లబ్ లో రాత్రి మూడు గంటల వరకూ త్రాగి, తన ప్రెండ్స్ తో గడిపి తూలకుంటూ మీడియాకు కనిపించి, ఆ తర్వాత ఆ మైకంలోనే పోజు లివ్వటం అందరనీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పద్దెనిమిది సంవత్సరాలు స్టార్ నైట్ అవుట్ చేసి రోడ్డుపై తూలుతూ వెళ్ళటం అక్కడ పత్రికలు అన్నీ ప్రచురించాయి. కొంతదూరమెళ్ళాక ఆమె నడవలేని స్ధితిలో ఉంటే ప్రెండ్స్ మోసుకెళ్ళారంటూ ఫాక్స్ న్యూస్ వారు రిపోర్ట్ చేస్తున్నారు. ఇక కెరీర్ మంచి ఊపుమీద ఉన్నప్పుడు ఇలాంటివి పనులు ఆమెకు దెబ్బతీసేవే అని సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె పార్టీలో ఉన్న సమయంలో కొందరు మీడియా వారు లోపలకి ప్రవేశిస్తే ఆమె వెనక డోర్ నుంచి తప్పించుకోవటంతో కొంతలో కొంత లైవ్ కవరేజ్ తప్పిందని చెప్తున్నారు.ఈ సంఘన మార్చి 12వ తేదీ రాత్రి చోటు చేసుకుంది.


Click it and Unblock the Notifications











