భర్త ముందే... హీరోయిన్ జుట్టుపట్టి లాగి బలవంతంగా ముద్దులు (షాకింగ్ వీడియో)
సినిమా సెలబ్రిటీలు బయట అడుగు పెడితే స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవనే చెప్పాలి. అభిమానం వెర్రితలలు వేసిన సందర్బాలు అనేకం. కొందరు హీరోయిన్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, తాకకూడని చోట తాకడం లాంటి చేస్తూ రాక్షసానందం పొందుతుంటారు. ఇలాంటి పరిస్థితి కేవలం ఇండియాలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది. తాజాగా అమెరికన్ పాప్ సింగర్, నటి మిల్లీ సైరస్‌ను అభిమానులు చుట్టుముట్టారు. అయితే అందులో ఒకడు ఆమెకు బలవంతంగా ముద్దులు పెట్టడం సంచలనం అయింది. చుట్టూ బాడీగార్డులు ఉన్నప్పటికీ సదరు అభిమాని ఈ సాహసానికి పాల్పడం చర్చనీయాంశం అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భర్త ముందే బలవంతంగా ముద్దులు, వైరల్ అవుతున్న వీడియో
మిలీ సైరస్ ప్రస్తుతం తన భర్త లియామ్ హేమ్స్‌వర్త్‌తో కలిసి స్పెయిన్ దేశంలోని బార్సీలోనాలో పర్యటిస్తున్నారు. తన భర్తతో కలిసి బయటకు వచ్చిన సమయంలో కొందరు అభిమానులు చుట్టు ముట్టారు. అందులో ఒకరు సందెట్లో సడేమియాలా దూసుకొచ్చి ఆమెపై బలవంతంగా ముద్దుల వర్షం కురిపించాడు.

జుట్టుపట్టి తనవైపుకు లాక్కున్నాడు
వీకెండ్ ఔటింగులో భాగంగా మిలీ, లియామ్ బయకు రాగానే భారీ సంఖ్యలో అభిమానులు చుట్టు ముట్టారు. బాడీగార్డుల సహయంతో ఆ జన సమూహం నుంచి నడుచుకుంటూ వెళుతుంటే ఒకడు ఆమె జుట్టుపట్టి లాగి బలవంతంగా ముద్దులు పెట్టాడు.

షాకింగ్ ఘటనతో తేరుకున్న భర్త
ఏం జరుగుతుందో గమనించేలోపే అతగాడు ముద్దు పెట్టేసి జారుకున్నాడు. ఈ సంఘటనతో షాకైన మిలీ సైరస్ భర్త లియామ్.... ఆమెను తన ముందుకు లాక్కుని రక్షణగా నిల్చుని కారు వరకు తీసుకళ్లాడు. ఆ సాహసి చేసిన పనికి ఇతర అభిమానులు సైతం అవాక్కయ్యారు.
లైట్ తీసుకున్నా మిలీ సైరస్
అయితే ఈ ఉదంతాన్ని మిలీ సైరస్ లైట్ తీసుకున్నారు. చిన్నతనంలోనే సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిలీ సైరస్‌కు ఇవేమీ కొత్తకాదు. అందుకే ఈ విషయాన్ని ఇద్దరు దంపతులు లైట్ తీసుకున్నారు. ప్రస్తుతం మిలీ సైరస్ తన మ్యూజిక్ ఆల్బమ్ ‘షి ఈజ్ కమింగ్' ప్రమోషన్లో బిజీగా గడుపుతున్నారు.

మిలీ సైరస్
26 ఏళ్ల మిలీ సైరస్ టీనేజీ వయసు నుంచే సంగీత రంగంలో, నటన రంగంలో తనదైన ముద్ర వేస్తూ అమెరికాలో టాప్ సెలబ్రిటీగా ఎదిగారు. భారీగా అభిమానులు కలిగిన టాప్ పాప్ స్టార్లలో ఆమె ఒకరు. ఇటు సినిమాలు, అటు మ్యూజిక్ ఆల్బమ్స్, లైవ్ కాన్సెర్టులతో మిలీ సైరస్ బిజీ బిజీగా గడుపుతుంటారు.


Click it and Unblock the Notifications











