సెక్సీ పాప్‌స్టార్ విచ్చలవిడి తనం...జైలుకెళ్లే అవకాశం!
లాస్ ఏంజిల్స్: అమెరికన్ సింగర్, పాప్ స్టార్ మిలీ సైరస్ వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల మెక్సికన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా జరిగిన ఓ లైవ్ షోలోఆమె విచ్చలవిడిగా ప్రవర్తించింది. మెక్సికన్ జెండాను అవమాన పరిచే విధంగా ప్రవర్తించింది. వెంటనే ఈ ఘటనపై విచారణ జరుపాలని, జెండాను అవమానించినట్లు తేలితే కఠినంగా శిక్షించాలని పలవురు డిమాండ్ చేస్తున్నారు.
ఆమెపై నేరం రుజువైతే....1200 డాలర్ల జరిమానాతో పాటు, 36 గంటల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. మెక్సికన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మిలీ సైరస్ మోన్‌టెర్రీలో జరిగిన కార్యక్రమంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఫేక్ బుట్(కృత్రిక పిరుదులు)తో దర్శనమిచ్చింది.

ఈ సందర్భంగా ఆమె పలువురు మేల్ డాన్సర్లతో కలిసి వేసిన స్టెప్పులు, మెక్సికన్ జెండాను పట్టుకుని వేసిన స్టెప్పులు అసభ్యకరంగా ఉండటంతో పాటు, జెండాను అవమానించే విధంగా ఉండటంతో పలువురు మెక్సికన్ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను శిక్షించాలనే డిమాండ్ రోజు రోజకు పెరుగుతోంది.
మిలీ సైరస్ కంటే ముందు కూడా పలువురు సెలబ్రిటీలు మిక్సికన్ జెండాను అవమానించే విధంగా ప్రవర్తించి జరిమానాకు గురయ్యారు. గత కొన్ని రోజుల క్రితం పౌలినా రుబియో మెక్సికన్ జెండా కప్పుకుని మేగజైన్‌పై నగ్నంగా ఫోజులు ఇచ్చినందుకు గాను 4వేల డాలర్ల జరిమానాకు గురయ్యారు.
Image Courtesy: twitter


Click it and Unblock the Notifications











