బాయ్ ఫ్రెండుతో రొమాన్స్: కానీ గర్భవతి కాలేదు!
హైదరాబాద్: అమెరికన్ పాప్ స్టార్ మిలీ సైరస్ కొన్ని రోజులుగా కొత్త బాయ్ ఫ్రెండ్ పాట్రిక్ ష్వార్జ్ నెగ్గెర్‌తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో వీరి రొమాన్స్ రోడ్డు కెక్కాయి. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా సైతం ముద్దుల్లో మునిగి తేలుతున్నారు.
ఈ మధ్య కాలంలో ఓ మేగజైన్లో ఆమె గురించి ఓ సంచలన వార్త వచ్చింది. త్వరలో ఆమె తన బాయ్ ఫ్రెండు ద్వారా ఫస్ట్ చైల్డ్‌కి జన్మనిచ్చే అవకాశం ఉందని ఆ వార్తల సారాంశం. దీంతో వెంటనే మిలీ సైరస్ ప్రతినిధి మీడియా ముందుకొచ్చి అసలు విషయాన్ని వెల్లడించారు. ఇద్దరూ డేటింగులో ఉన్న మాట వాస్తవమే కానీ....మిలీ సైరస్ గర్భవతి కాదని స్పష్టం చేసారు.

ఆ సంగతి పక్కన పడితే...మిలీ సైరస్ ఇటీవలే తన 22వ పుట్టినరోజు గ్రాండ్‌గా జరుపుకుంది. బర్త్ డే పార్టీలో వైల్డ్‌గా రెచ్చిపోయింది. తన కొత్త బాయ్ ఫ్రెండ్ పాట్రిక్ ష్వార్జ్‌నెగ్గర్‌తో కలిసి పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఆమె పుట్టినరోజు పార్టీ వల్డ్‌గా జరిగింది. సాధారణంగానే స్టేజీ షోలలో ఓవర్‌గా ప్రవర్తించే మిలీ సైరస్ తన పుట్టినరోజు పార్టీలో విచ్చలవిడి తనం ప్రదర్శించింది.
పార్టీలో ఫుల్లుగా మందు కొట్టిన మిలీ సైరస్....టాప్ లెస్‌గా డాన్సులు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది. హాలీవుడ్ లోని ఫ్యాక్టరీ నైట్ క్లబ్‌లో శనివారం రాత్రి మిలీ సైరస్ బర్త్ డే పార్టీ జరిగింది. ఈ వేడుకకు పలువురు పాప్ సెలబ్రిటీలు, ఆమె ఫ్రెండ్స్ హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











