అభిమాని చేష్టలకు ఖంగుతిన్ని హీరోయిన్
హాలీడే స్పాట్ 'కొస్టారికా'లో ఎంజాయ్ చేద్దామని వచ్చిన సింగర్ మైలీ సైరస్ రూఢ్‌గా ప్రవర్తించిన తన అభిమానికి తగిన బుద్ది చెప్పిన వీడియో ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే మైలీ సైరస్ తన ఆస్ట్రేలియన్ బాయ్ ప్రెండ్ లైమ్ హెమ్స్ వర్త్‌తో హెలీ కాప్టర్‌లో కోస్టారికా బీచ్‌లోకి దిగగానే మైలీ సైరస్ అభిమానులు తండోపతండాలుగా వచ్చి ఆటోగ్రాఫ్‌లు, ఫోటోలు కోసం ఎగబడగా, అభిమానుల కోరికను తీర్చడం కోసం మైలీ సైరస్‌తో పాటు, ఆమె బాయ్ ప్రెండ్ కూడా ఫోజులిచ్చారు.
ఇదే సందర్బంలో ఫోటోగ్రాఫ్ అందని ఓ అభిమాని మైలీ సైరస్‌ని దూషించాడు. ఆ తర్వాత కొంత సమయానికి ఇదే వీడియోని ఆన్ లైన్‌లో చూసిన మైలీ సైరస్ ఆ అభిమాని దూషించిన మాటలకు ఖంగుతిన్నారు. ఇంతకీ ఆ అభిమాని దూషించిన మాట ఏమిటంటే అసలు 'ఏమిటి ఇదంతా..ఇది నిజంగా మైలీ సైరస్ యేనా' అని అన్నాడు. దాంతో ఈ మాటకు ఖంగుతిన్న మైలీ సైరస్ అభిమానులందరికి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వక పోతే ఇలాంటి పరిస్దితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంది.


Click it and Unblock the Notifications











