ఎంతటి స్టారైన తల్లిదండ్రులు విడిపోతుంటే బాధ ఉండదా..!
అమెరికాకు చెందిన సింగర్ మరియు బుల్లితెర డిస్నీ టివీ వారి 'హన్నామొంతన' కార్యక్రమంతో పాపులర్ అయిన మైలీ సైరస్ ఇప్పుడు కొత్త ఇబ్బందికి గురికాబోతున్నారు. దానికి కారణం మైలీ సైరస్ వాళ్శ తల్లిదండ్రులు పదహేడుసంవత్సరాల తర్వాత విడాకులు కావాలని కోర్టుకెక్కారు. బిల్లి రే సైరస్ అతని భార్య టిష్ ఇద్దరూ పదహేడు సంవత్సారాల క్రితం ప్రేమించి పెళ్శి చేసుకున్నారని సమాచారం. వీరిద్దరికి అయిదుగురు పిల్లలు. అందులో మన టివి స్టార్ ఒకరు.
వీరిద్దరూ కొన్ని విబేధాల వల్లనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్యామిలి కోర్టులో విడాకులు కావాలని అడిగారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ఇలా మేము విడిపోవడం వల్ల మాకుటుంబం విచ్చిన్నం అవుతుంది. కాని కొన్నికారణాల వల్ల విడిపోక తప్పుదు అని అన్నారు. దీనిపై స్పందించవలసిందిగా మైలీ సైరస్ నిఅడుగగా మైలీ సైరస్ ప్రస్తుతానికి ఈ విషయంపై నేను ఏమి మాట్లాడలేను అని అన్నారు. మూడేళ్ల నుండీ డిస్నీ హాట్ తారగా వెలుగొందుతున్న మిలే సైరస్ 2009 వ సంవత్సరానికి గాను వరెస్ట్ సెలబ్రిటీగా ఎన్నికయిన విషయం మన అందరికి తెలిసిందే..
ఇక మైలీ సైరస్ విషయానికి వస్తే లైమ్ హెమ్స్ వర్త్ ఇద్దరూ సంవత్సరం నుండి డేటింగ్ లో పోల్గోంటున్నారని సమాచారం. కోన్ని అనివార్య కారణాల వల్ల పోయిన జులై లో వీరిద్దరు విడిపోయారు. ఈ సందర్బంగా లైమ్ హెమ్స్ వర్త్ మాట్లాడుతూ మైలీ సైరస్ మరలా తన జీవితంలోకి రావాలని కోరుకుంటున్నానని అన్నారు..ఇలాంటి సమయంలో మైలీ సైరస్ తల్లిదండ్రులు విడిపోయి ఇంకోక భాదను మైలీ సైరస్ కుకలిగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











