అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ బోల్తా కొట్టావులే మిలే..!!

By Kuladeep

గురివింద తన నలుపు ఎరుగదన్న తరహాలో ప్రవర్తిస్తోంది 17 ఏళ్ల టీనేజ్ స్టార్ మిలే సరస్. తనకంటే పెద్ద స్టార్ల మీద విమర్శలు గుప్పిస్తే పబ్లిసిటీ వస్తుందనుకుందో మరేంటో గానీ ఏకంగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంజలీనా జోలీ, పాప్ స్టార్ మడోన్నా ల విమర్శనాశ్త్రాలు ఎక్కుపెట్టింది. అసలు వీరిద్దరూ తమ స్వార్థం కోసం పిల్లలతో ఆడుకుంటున్నారంటూ ఘాటైన విమర్శలు చేసింది. ఈ వార్తల వివరాల్లోకి వెళ్తే....

టీనేజ్ స్టార్ సరస్ ఇటీవల ఓ ఐరిష్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్యూలో కొంత మంది సెలబ్రిటీలు వారి పిల్లలను వారి అనుమతి లేకుండా కెమరా ముందుకు తీసుకువస్తున్నారు. అది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ముఖ్యం గా ఏంజలీనా జోలీ, మడోన్నా లాంటి వాళ్లు వారి వారి పబ్లిసిటీ కోసం వారి పిల్లలను పబ్లిక్ లోకి తీసుకువస్తున్నారు. ఇంత చిన్న వయసులో వారికి ఈ పబ్లిసిటీ ఎంత ఇబ్బందిగా వుంటుందో వారు ఆలోచించడం లేదు అని విమర్శల వర్షం కురిపించింది.

పిల్లలకు మద్దతుగా మాట్లాడినందుకు నాకు అందరి మద్దతు లభిస్తుందని భావించిన మిలే అందరూ తిరిగి ఆమె మీద విమర్శలు కుప్పిస్తుంటే ఖంగుతింది. అసలు మిలే సరస్ 11 ఏళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చింది. మరి అప్పుడు ఆమెకు లభించిన పబ్లిసిటీని ఎంజాయ్ చేసింది కదా...!! అయినా జోలీ, మడోన్నా లు తమ పిల్లల అనుమతి లేకుండా వారిని బయటకు తీసుకొస్తున్నారని ఈవిడకెవరు చెప్పారు. అనవసర పబ్లిసిటీ స్టంట్స్ మానుకోవడం మంచిది అని ఆమెకు సలహా ఇస్తున్నారు. దీనికి తోడు ఇటీవల ఈమె తన చిన్ని చెల్లికి అసభ్యకరమైన నృత్యాన్ని నేర్పిస్తూ కెమెరాలకు చిక్కలేదా...?? ముందు నీ కింద వున్న నలుపును చూసుకో ఆ తర్వాత ప్రక్క వారిని ఎత్తి చూపచ్చని ఆమెకు గట్టిగా సమాధానం ఇస్తున్నారట హాలీవుడ్ జనం....డ్యామిట్ కథ అడ్డం తిరిగింది..అనుకుంటోందట మిలే....!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X