ప్రియుడి కోసం అభిమానులను కాదన్న పాప్ తార- మిలే సైరస్

ఆ వివరాలు ఇలా వున్నాయి. "నా అభిమానులైన మీరంతా నా హృదయానికి చాలా దగ్గరగా వుంటారు. ట్విటర్ ను తొలగించాక దురదృష్టావశాత్తు మీలో కొందరు నేను మిమ్మల్ని నర్లక్ష్యం చేస్తున్నానని అనుకుంటున్నారని విన్నాను. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇది మంచి వేదికగా ఉపయోగపడింది. కానీ ప్రతి పనీ బిజినెస్ లాగే అనిపిస్తోంది. నా కంటూ ఓ జీవితం ఉంది అన్న విషయాన్నే మరచిపోయాను. కాబట్టి తన వ్యక్తిగత జీవితాన్ని ఆశ్వాదించడానికి తానీ నిర్ణయం తీసుకున్నట్టు" చెప్పింది. ఈ నిర్ణయం మీలో ఎవరినైనా బాధిస్తే క్షమించమని కోరింది. తన మిత్రుడు లియామ్ సలహా మేరకే తానీ నిర్ణయం తీసుకున్నానని, అతని సహచర్యం ఎంతో గొప్పగా వుందని కూడా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











