twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియుడి కోసం అభిమానులను కాదన్న పాప్ తార- మిలే సైరస్

    By Kuladeep
    |

    Miley Cyrus
    అమెరికా పాప్ స్టార్, టీవీ నటి మిలే సైరస్ తన అభిమానులతో దగ్గరగా వుండేందుకు ట్విటర్ లో చేరి వారితో ముచ్చటించేది. కానీ ఇప్పుడామె అభిమానులను నిరాశపరిచే నిర్ణయం తీసుకుంది. ట్విటర్ లో తన అకౌంట్ ను తొలగించింది. ఇక పై ట్విటర్ లో కొనసాగనని ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులు చాలా నిరాశపడ్డారు. దీనిపై ఆమె తన అధికారిక వెబ్ సైట్ లో వివరణ ఇచ్చింది.

    ఆ వివరాలు ఇలా వున్నాయి. "నా అభిమానులైన మీరంతా నా హృదయానికి చాలా దగ్గరగా వుంటారు. ట్విటర్ ను తొలగించాక దురదృష్టావశాత్తు మీలో కొందరు నేను మిమ్మల్ని నర్లక్ష్యం చేస్తున్నానని అనుకుంటున్నారని విన్నాను. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇది మంచి వేదికగా ఉపయోగపడింది. కానీ ప్రతి పనీ బిజినెస్ లాగే అనిపిస్తోంది. నా కంటూ ఓ జీవితం ఉంది అన్న విషయాన్నే మరచిపోయాను. కాబట్టి తన వ్యక్తిగత జీవితాన్ని ఆశ్వాదించడానికి తానీ నిర్ణయం తీసుకున్నట్టు" చెప్పింది. ఈ నిర్ణయం మీలో ఎవరినైనా బాధిస్తే క్షమించమని కోరింది. తన మిత్రుడు లియామ్ సలహా మేరకే తానీ నిర్ణయం తీసుకున్నానని, అతని సహచర్యం ఎంతో గొప్పగా వుందని కూడా చెప్పుకొచ్చింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X