నాకు నచ్చినట్టు నేనుంటా..!! అభిమానలతో నాకేం పని..!!
అమెరికాకు చెందిన సింగర్, నటి, డిన్నీ టివీ వారి 'హన్నామొంతన' కార్యక్రమంతో పాపులర్ అయిన మిలే సరస్ ఇటీవల అన్నీ వివాదాశ్పద విషయాలతోనే పాపులర్ కావాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది. మొన్నటికి మొన్న హాలీవుడ్ స్టార్ నటీమణి ఏంజలీనా జోలీ, మడోన్నాలు తమ పిల్లల్ని వారి అనుమతి లేకుండా మీడియా ముందుకు తీసుకువచ్చి వారి పబ్లిసిటీ కోసం తమ పిల్లల్ని ఉపయోగించుకుంటున్నారని ఆక్షేపించి, ఆ తర్వాత నీ సంగతేంటి నీవు కూడా పిన్న వయసులోనే మీడియా ముందుకు వచ్చావు కదా.. ఇలాంటి దిక్కుమాలిన విమర్శలు మానుకో అని హాలీవుడ్ మొత్తం ఎదురుప్రశ్నించే సరికి నాలుక్కరచుకుంది.
ఇప్పుడు మరో సారి వివాదాశ్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది మిలే. తనను చూసి తమ పిల్లలు చెడిపోతున్నారని అమెరికాలో ఆమె మీద విమర్శలు పెల్లుబుకుతుంటే, నిన్న మొన్నటి వరకూ పిల్లల్ని అర్థం చేసుకోవడంలో నేను అందరికంటే ముందుంటాను అని గొప్పలు పోయి మిగిలిన వారిని విమర్శించిన మిలే ఇప్పుడు మాట మార్చింది. మీ పిల్లలను మీరే దారిలో పెట్టుకోండి. అది చేత కాక నా మీద పడి ఏడుస్తారు ఎందుకు...?? అయినా మీ పిల్లల గురించి ఆలోచించడానికి నేనేమన్నా వారి తల్లినా మీ పిల్లల్ని మీరే దారిలో పెట్టుకోండని ఎదురుదాడి చేస్తోంది. అవును మరి ఇతరులకు నీతులు చెప్పడం సులువే కానీ ఆచరించడం ఎంత కష్టమో ఆమెకు ఇప్పుడు బోధపడి వుంటుంది.


Click it and Unblock the Notifications











