ముద్దు కూడా స్నేహంలో భాగమేనా..??
హాలీవుడ్ టీనేజ్ నటి మిలే సరస్ తన సహ నటుడు లియామ్ హెమ్స్వర్త్ తో ప్రేమలో పడిందనే వార్తలు హాలీవుడ్ వీధుల్లో షికారు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ వార్తలని వీరిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు.
కానీ మిలే మాత్రం వీలు చిక్కినప్పుడల్లా అతన్ని ఓ మంచి మిత్రుడని అతన్ని పొగడ్తలతో ముచ్చెత్తుతోంది. ఇది చూసిన వారు మాత్రం ఆమె లియామ్ తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందని ఎప్పుడూ అతని ధ్యాసే అని చెవులు కొరుక్కుంటున్నారు. కానీ ఆమె మాత్రం మా ఇద్దరి మధ్య వున్న స్వచ్చమయిన స్నేహాన్ని అపార్థం చేసుకోవద్దని అందరికీ విన్నవించుకుంటోంది.
సరేలే పాపం అని నమ్మేద్దాం అనుకున్న వారికి షాక్ ఇచ్చేలా వారిద్దరూ ఇటీవల చాలా ఘాటుగా ముద్దుపెట్టుకుంటూ కనపడ్డారు. వారిద్దరూ జంటగా నటిస్తోన్న 'ది లాస్ట్ సాంగ్' సినిమా షూటింగ్ లో పాల్గొన్న వీరిద్దరూ ఇలా కనిపంచే సరికి చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. మరికొందరయితే ఇది కూడా స్నేహంలో భాగమేనా అని ఎదురు ప్రశ్నిస్తున్నారట. మరి దీని గురించి మాత్రం ఆమె నోరు మెదపటం లేదు...!! ఎందుకంటారూ...??


Click it and Unblock the Notifications











