Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మంటల్లో సినీ స్టార్స్ ఇళ్లు...బుగ్గిపాలు కావడంతో బోరుమంటూ ట్వీట్స్!
అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు రేగడంతో తీర ప్రాంతంలో ఉన్న అనేక ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 177 గృహాలు బూడిదయ్యాయి. ఇందులో పలువురు హాలీవుడ్ స్టార్స్‌కు చెందిన గృహాలు సైతం ఉన్నాయి.
సౌత్ కాలిఫోర్నియాలోని మలిబు తీర ప్రాంతంలో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఇళ్లు నిర్మించుకున్నారు. వీరిలో పాప్ సింగర్ మిలీ సైరస్‌తో పాటు గెరార్డ్ బట్లర్, రాబిన్ థిక్స్, లేడీ గాగా, ఓర్లాండో బ్లూమ్స్ లాంటి వారు ఉన్నారు.
|
బుగ్గిపాలైన మిలీ సైరస్ ఇళ్లు
పాప్ సింగర్ మిలీ సైరస్ ఇల్లు ఈ కార్చిచ్చులో పూర్తిగా దహనమైంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే తాను అదృష్ట వంతురాలినని, ఇంట్లో ఉన్న తన పెంపుడు జంతువులు క్షేమంగా బయట పడ్డాయి. నా ఇల్లు ఇపుడు లేకపోయినా.... ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ పదిలంగా ఉండిపోతాయి అని ట్వీట్ చేశారు.
|
గెరార్డ్ బట్లర్
హాలీవుడ్ నటుడు గెరార్డ్ బట్లర్ నివాసం కూడా పూర్తిగా కాలిపోయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఫోటో షేర్ చేశారు. ఈ దృశ్యం చూడగానే తన గుండె పగిలిపోయిందని పేర్కొన్నారు.
రాబిన్ థిక్
ఈ ప్రమాద ఘటనపై హాలీవుడ్ స్టార్ రాబిన్ థిక్ స్పందిస్తూ... ప్రజలను, ఇళ్లను కాపాడటానికి ఫైర్ ఫైటర్స్ ఎంతో కృషి చేశారని, వారికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. మీ వల్లే మేమంతా క్షేమంగా బయట పడ్డామని వెల్లడించారు.
|
కేట్లిన్ జెన్నర్
కార్చిచ్చు పూర్తిగా తర్వాత కేట్లిన్ జెన్నర్ తన పార్ట్నర్ సోఫియా హాచిన్స్తో కలిసి తిరిగి తమ ఇంటికి వచ్చారు. తాము ఎంతో అదృష్టవంతులమని, ఈ ప్రమాదంలో తమ ఇంటికి ఏమీ కాలేదని వెల్లడించారు. అయితే చుట్టూ పక్కల ప్రాంతం అంతా కాలి బూడిదైన విషయాన్ని వెల్లడిస్తూ వీడియో షేర్ చేశారు.