షాకింగ్: 5 పళ్లు పీకించుకున్న కుర్ర బ్యూటీ...(ఫోటోస్)

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: అమెరికన్ కుర్ర పాప్ స్టార్.... ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో వ్యక్తిగా ఉండే మిలీ సైరస్ ఈ సారి అభిమానులకు బాధ కలిగించే పోస్టు చేసింది. ఇటీవల ఆమె డెంటల్ సర్జరీ చేయించుకుంది. తన నోటి నుండి దాదాపు పళ్లు పీకించుకుంది. ఇందుకు సంబంధించిన ఆమె పోస్టు చేసిన ఫోటోలు కాస్త భయానకంగా ఉన్నాయి.

22 ఏళ్ల మిలీ సైరస్ బుధవారం ఈ డెంటల్ సర్జరీ చేయించుకుంది. సర్జరీకి సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. సర్జరీ వల్ల ఆమె ఎంత నొప్పి అనుభవించిందో ఈ ఫోటోలు చూస్తే స్పష్టమవుతుంది. సర్జరీ తర్వాత వాళ్ల అమ్మే ఆమెను దగ్గరుండి చూసుకుంటోంది. మా అమ్మ మంచి నర్స్ అంటూ పొగడ్తలు గుప్పించింది మిలీ సైరస్.

Miley Cyrus Undergoes Dental Surgery To Remove 5 Teeth

అమెరికన్ హాట్ సింగర్లలో ఒకరైన మిలీ సైరస్ ఇపుడు మంచి ఫాంలో ఉంది. కుర్రకారు ఆమె పాటలన్నా, స్టేజీ షోలన్నా పడి చస్తారు. యువతను ఊర్రూతలూపే డాన్స్ షో....మత్తెక్కించేలా అందాల ప్రదర్శన ఆమె షో ప్రత్యేకతలు. 22 ఏళ్ల ఈ భామకు టాలెంటుతో పాటు కాస్త పబ్లిసిటీ వెర్రి కూడా ఉంది.

Miley Cyrus Undergoes Dental Surgery To Remove 5 Teeth

బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం, తాము ఎంజాయ్ చేసిన సంఘటనలు మీడియా కంటపడేలా చేసి పబ్లిసిటీ పెంచుకోవడం లాంటివి చేస్తుంటుంది. అయితే ఈ పాప ఇపుడు ఉన్నట్టుండి పళ్లు ఊడగొట్టించుకుని మరీ ఎందుకు సర్జరీ చేయించుకుందో అర్థం కావడం లేదు. తన ఫేసులో మార్పులు చేసుకుని మరింత అందంగా తయారవడానికే ఆమె ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Miley Cyrus Undergoes Dental Surgery To Remove 5 Teeth

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X