twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవంబర్ 23తో నేను మేజర్ అవుతాను ఇక అప్పుడుంటుంది చూడండీ..

    By Nageswara Rao
    |

    డిస్నీ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బుల్లి స్టార్ హీరోయిన్ 17 ఏళ్ల మిలే సైరస్ ఈ నెల 23వ తారీఖున 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. దీనిపై మాట్లాడవలసిందిగా మీడియా మిలే సైరస్ కోరడంతో ఈసంవత్సరం ఈపుట్టిన రోజుని పెద్ద ప్రత్యేకంగా ఏమి జరుపుకోవడం లేదని అన్నారు. ఈ పుట్టిన రోజు కోసం నేను ఏమి పెద్ద క్రేజీగా ఎదురుచూడడం లేదని అన్నారు.

    ఈ పుట్టిన రోజుని నా తల్లిదండ్రుల సమక్షంలో ఏదో చిన్న పార్టిని చేసుకుంటానని అన్నారు. ఎందుకంటే నా తల్లి దండ్రులతో పుట్టిన రోజు జరుపుకుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా మేమందరం కలసి బీచ్ కివెళ్శాలని ప్లాన్ చేసుకున్నాం. బోట్ తోస్కూబా డైవింగ్ లాంటివి తనకి చాలా ఇష్టమని వివరించారు. ఈపుట్టినరోజు నాజీవితంలో ఓ ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతుందని అన్నారు. దానికి కారణం నా తల్లిదండ్రులు ఇద్దురూ రెండువారాల క్రితం విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించిన సంగతి అందరికి తెలిసిందే.

    దీనిని బట్ట మీకందరికి ఒకటి అర్దం అయ్యే ఉంటుంది. ప్రస్తుతం మా కుటుంబం కోంచెం కష్టకాలంలో ఉందని. కాని మాకుటుంబంలోని కోన్ని గోడవలను మేమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నస్తున్నామని అన్నారు. అందుకే ఈ పుట్టినరోజు నాజీవితంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకోవడమేకాకుండా నేను మైనర్ నుంచి మేజర్ అవ్వడం జరుగుతుంది.

    గతంలో 17 ఏళ్ల మైలీ సైరస్ తన సహ నటుడు లైమ్ హెమ్స్ వర్త్ తో ప్రేమలో పడిందనే వార్తలు హాలీవుడ్ వీధుల్లో షికారు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ వార్తలని వీరిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. హాలీవుడ్ యూత్ జంట మైలీ సైరస్, లైమ్ హెమ్స్ వర్త్ వీళ్శిద్దరూ కలసి 'లాస్ట్ సాంగ్' నటించారు. ఈ సినిమాలో వీళ్శు ఇద్దరూ మంచి హాట్ సన్నివేశాల్లో నటించారు. 'ది లాస్ట్ సాంగ్' సినిమాని నికోలస్ స్పార్క్ నవల ఆథారంగా తీశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X