»   » న్యూడ్ ఫోటోలు పంపిన హీరోయిన్, మూడ్ రావాలనే!

న్యూడ్ ఫోటోలు పంపిన హీరోయిన్, మూడ్ రావాలనే!

Posted By:
Subscribe to Filmibeat Telugu
లాస్ ఏంజిల్స్ : ప్రముఖ హాలీవుడ్ నటి మిల్లా జోవోవిచ్ తన భర్తకు మూడ్ తేవడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. మూడాఫ్ లో ఉన్న తన శ్రీవారికి తన నగ్న ఫోటోలు ఫోన్ ద్వారా సెండ్ చేసి మూడ్ తెప్పించే ప్రయత్నం చేసింది. భర్తకు మూడ్ తేవడానికి అతనికి తన నగ్న అందాల విందు చేయడం సాధారణమే కానీ, తన నగ్న అందాలను సెల్ ఫోన్లో బంధించి అతనికి సెండ్ చేయడం విడ్డూరం కాకపోతే మరేమిటి?

మోడలింగ్ నుంచి నటిగా మారిన మిల్లా జోవోవిచ్ ఫిల్మ్ మేకర్ పాల్ డబ్ల్యుఎస్ అండర్సన్‌ను 2009లో పెళ్లాడింది. అయితే వర్క్ ఈ మధ్య పని భారం వల్ల ఆమె భర్త చాలా మూడాఫ్ లో ఉంటున్నాడట. దీంతో అతన్ని మాంచి మూడ్ లోకి తేవడానికి మిల్లా జోవోవిచ్ ఈ చర్యకు పాల్పడినట్లు డైలీస్టార్ అనే ఇంటర్నేషనల్ వెబ్ సైట్ పేర్కొంది.

హలో మేగజైన్‌తో మిల్లా జోవోవిచ్ మాట్లాడుతూ...''పాల్ అతను పని చేస్తున్న సినిమా సెట్ నుండే నాకు ఫన్నీ టెక్ట్స్ మెసేజ్ పంపాడు. ఫీల్డ్ లో వర్షం పడుతోందని, బురదలో నిల్చున్నానని మెసేజ్ పంపాడు. నేను దానికి సమాధానంగా 'నేను కాన్స్ లో ఉన్నాను. షాంపెన్ తాగుతూ రెడ్ కార్పెట్ పై నిల్చున్నాను' అని రిప్లై ఇచ్చాను. అతనికి మూడ్ మారాలని నా న్యూడ్ ఫోటో కూడా పంపాను'' అని మిల్లా జోవోవిచ్ తెలిపారు.

English summary
Actress Milla Jovovich has a unique way of lifting up her husband's mood. She send him photographs of herself naked.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu