Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏంజిలినా జోలి కంటే మిల్లా జోవోవిచ్ చాలా తెలివైనది..!
న్యూయార్క్: హాలీవుడ్ లో మిల్లా జోవోవిచ్, ఏంజిలినా జోలి కంటే చాలా గట్టదని అంటున్నారు. ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తు వాళ్శకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ డాన్ ఆండ్రసన్. ఇటీవల ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు డాన్ ఆండ్రసన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏంజిలినా జోలి నటించిన 'సాల్ట్' సినిమాకు గాను కొన్ని పోరాట సన్నివేశాలను ఈయన ఆధ్వర్యంలోనే చేయడం జరిగింది. 'సాల్ట్' సినిమా సమయంలో ఏంజిలినా జోలి చాలా సాహాసోపేతంగా చేసిందని, ఒక భారీ ఫైట్ సీనును కూడా చాలా అవలీలగా చేసిందని ఆయన పేర్కోన్నాడు.
మిల్లా జోవోవిచ్ కూడా తెలుగు ప్రేక్షకులకు 'రెసిడెంట్ ఈవిల్' అనే సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ప్రస్తుతం ఈమె నటించిన 'రెసిడెంట్ ఈవిల్-4' విడుదలకు సిధ్దంగా ఉంది. మిల్లా జోవోవిచ్ ఈ సినిమాలో చాలా అధ్బుతంగా నటించారు. ఏంజిలినా జోలి తో పోల్చుకున్నట్లైతే మిల్లా జోవోవిచ్ కి కాళ్శు పోడవుగా ఉండడం వల్ల కొన్నికొన్ని ఫైట్స్ ని అవలీలగా చేయడం జరిగిందన్నారు. పోడవాటి కాళ్సు ఉండడం వల్ల విలన్స్ ని తన్నడానికి చాలా వీలుగా ఉంటుందని ఆయన వివరించారు. నేను ఫైట్స్ ని కంపోజ్ చేసిన హిరోయిన్లులలో 'ఏంజిలినా జోలి', 'మిల్లా జోవోవిచ్', 'లూసి లి' లు చాలా గట్టివారిని వెల్లడించారు. ఇక 'రెసిడెంట్ ఈవిల్-4' సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగా వచ్చిందని, ఈ సినిమాలోని కొన్నిసన్నివేశాలు మిమ్మల్ని మంత్ర ముగ్దుల్నిచేస్తాయని వెల్లడించారు.