twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాక్షన్ సినిమాలు చేసే నాకు ఈ కధ ఓ ధ్రిల్ గా అనిపించింది...!

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ లో మిల్లాజోవోవిచ్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. రెసిడెంట్ ఈవిల్ సినిమాలలో మిల్లాజోవోవిచ్ నటించిన తీరు అధ్బుతం. ఇటీవల కాలంలో రెసిడెంట్ ఈవిల్ నాల్గవభాగం లోనటించి మరలా తన సత్తాని చాటుకున్నారు. ఈ సినిమాలో నటించిన తీరుని చూసి దర్శకుడు జాన్ కుర్రన్ దర్శకత్వంలో కొత్తగా తీస్తున్న స్టోన్ అనే సినిమాలో మిల్లాజోవోవిచ్ కి లీడ్ రోల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాలో రాబర్ట్ డినిరో మరియు ఎడ్వర్డ్ నార్టన్ లాంటి బాక్సాఫీస్ హీరోలు నటిస్తున్నారు. ఐతే విషయం ఏమిటంటే అంతపెద్దహీరోలు ఉన్న సినిమాలో వాళ్శకి లీడ్ రోలు మిల్లాజోవోవిచ్ కి లీడ్ రోల్ ఇచ్చారు దర్సకులు.

    దీనిపై స్పందించిన మిల్లాజోవోవిచ్ మాట్లాడుతూ రాబర్ట్ డినిరో మరియు ఎడ్వర్డ్ నార్టన్ లాంటి గోప్ప హీరోలతో కలసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ విషయం డైరెక్టర్ గారు చెప్పగానే ఏడ్చేశాను. దానితో పాటు నాకు చాలా ఆనందం వేసింది. దానికి కారణం ఈ ఇద్దరు ఐకాన్స్ తో కలసి నటిస్తున్నందుకు. ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసే నాకు ఈ సైకోలాజికల్ ధ్రిల్లర్ లాంటి సినిమాలో నటించడం చాలా ధ్రిల్ గా అనిపించిందన్నారు. నా జీవితంలో ఇక ఇలాంటి సినిమా చేయలేనేమో అని అనుకుంటున్నాను. ఈ సినిమా షూటింగ్ ఉన్న రోజల్లో సెట్ లోకి నాకూతురు ని తీసుకోని రాలేదు. దాంతో నాకు చాలా బాధవేసింది.

    నా జీవితంలో నేను మరచిపోలేని రోజు నా పాపకు జన్మనిచ్చిన రోజు. ఇప్పుడు నాకు ప్రపంచం అంతా నా పాపే. జీవితంలో నేను ఇచ్చే మొట్టమొదటి ప్రయారిటి నా పాప మరియు నా భర్త ఆండర్సన్ కి మాత్రమే అని అంటోంది రెసిడెంట్ ఈవిల్ హీరోయిన్ మిల్లా జోవోవిచ్. ఒక తల్లిగా నేను ఎంతో నేర్చుకున్నాను. ప్రస్తుతం నా ధ్యాసంతా నా పాపపై ఉంది. ఇటీవల నా పాపకి కోంచెం సిక్ అయింది. దానితో నాకు కాళ్శు చేతులు ఆడలేదు, తన పరిస్దితి మామూలుగా అయ్యేంత వరకు. ప్రస్తుతం నా వయసు 34 సంవత్సరాలు, నేను కూడా నాపాపతో గేమ్స్ ఆడుకుంటున్నాను. దానికి కారణం దెయ్యాల సినిమాలలో నటించి నేను కూడా అలసిపోయాను అందుకే నేను నా పాప తో కలసి ఇలా ఎంజాయ్ చేస్తున్నాను.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X