హాట్ హీరోయన్‌కు అండర్ వేర్ గిఫ్టుగా ఇచ్చారు

తానే స్వయంగా అండర్ వేర్ బ్రాండ్‌ను ప్రారంభించే యోచనలో ఉన్న మిరందా కెర్ ఈ మేరకు తన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. తన క్రియేటివిటీతో లింగరీ తయారు చేయడం ప్రారంభించింది. తాను తయారు చేసిన లింగరీని ఇటీవల తన ఫ్రెండ్, హాలీవుడ్ స్టార్ జెన్నిపర్ ఆనిస్టిన్ పెళ్లి కోసం బహుమతిగా పంపింది. తన లింగరీకి పబ్లిసిటీ కల్పించేందుకే మిరందా కెర్ వీటిని సెలబ్రిటీలు గిఫ్టుగా ఇస్తుందనే వాదన కూడా ఉంది.
ఎంతో అందమైన ఈ లింగరీని చేత్తో కుట్టి తయారు చేసారట. అంతే కాదు అత్యంత నాణ్యమైన వస్త్రంతో అత్యంత నాణ్యతతో దీన్ని తయారు చేసారట. మిరందా కెర్ పంపిన లింగరీని జెన్నిఫర్ ఎంతో ఇష్ట పడిందని, తన పెళ్లి రోజు రాత్రి వాటిని ధరించేందుకు ఆసక్తిగా ఉందని...ఆమె సన్నిహితులు అంటున్నారు.
జెన్నిఫర్ ఆనిస్టన్ ఎవరో కాదు... ప్రముఖ హాలీవుడ్ హీరో బ్రాడ్ ఫిట్ మాజీ భార్య. గతంలో జెన్నిఫర్ ఆనిస్టన్, ఏంజలీనా జోలీ స్నేహితులు. జెన్నిఫర్ ఆనిస్టన్ తో స్నేహం చేస్తూ మెల్లిగా ఆమె భర్తతో సంబంధం పెట్టుకుంది. ఏంజలీనా జోలీపై మోజుతో భార్య జెన్నిఫర్‌కు విడాకులు ఇచ్చాడు బ్రాడ్ ఫిట్.
భర్త బ్రాడ్ ఫిట్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత జెన్నిఫర్ ఆనిస్టన్ కొన్నాళ్లు ఒంటరిగా జీవించినా గత కొంత కాలంగా నటుడు మరియు డైరెక్టర్ జస్టిన్ థ్రాక్స్ తో డేటింగ్ చేస్తుంది. 44 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్‌కి, జస్టిన్ థ్రాక్స్ ప్రపోజ్ చేయడం.. ఆ వెంటనే అక్కడే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. త్వరలో జెన్నిఫర్ ఆనిస్టన్, జస్టిన్ థ్రాక్స్ పెళ్లి చేసుకోబోతున్నారు. మిరందా కేర్‌కు ఓర్నాల్డ్ బ్లూమ్ తో పెళ్లయిన సంగతి తెలిసిందే. వీరికి 2 సంవత్సరాల వయసు గల బాబు కూడా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











