కాన్పు సమయంలో నాకు ఎటువంటి స్ట్రెచ్ మార్క్స్ అవలేదన్న మోడల్
సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది ఆడవాళ్శ చర్మం ముడతలు పడే విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా సూపర్ మోడల్ మిరందా కెర్ ఇటీవల ఓ బిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈసందర్బంగా మిరందా కెర్ మాట్లాడుతూ నేను నాపాపకు జన్మనిచ్చిన సమయంలో నాచర్మం కూడా ముడతలు పడుతుందని భావించాను. ఐతే దీనికి భిన్నంగా ఎటువంటి సిజేరియన్ లేకుండా హాయిగా నాకు ప్రసవం జరిగిందన్నారు. ఇది మాత్రమే కాకుండా నాచర్మం ఎటువంటి ముడతలు కూడా పడకుండా సహాజంగానే ఉందని మిరందా కెర్ తన బ్లాగ్‌లో తన అభిమానులుకు తెలియజేయడం జరిగింది. దీనితో పాటుతన పాప శరీరానికి రోజుకి రెండు సార్లు మాయిశ్చరైజర్స్ వాడడం జరుగుతుందని అన్నారు.
గతంలో ప్రెగ్నెన్సి సమయంలో కూడా మన అందాల మోడల్ తన అందాలను ఆరబోయడానికి వెనకాడలేదు. డబ్యు అనే మ్యాగజైన్ కవర్ పేజిపై తన ఆరు నెలల బేబి బంప్ నిచూపించడానికి వెనుకాడలేదు. అంతేకాకుండా ఈసందర్బంగా మిరంద కెర్ మాట్లాడుతూ పిల్లలకు జన్మనివ్వడం అనేది తల్లికి మరోజన్మలాంటిది. సరైన సమయంలో సరైన మెడికల్ ట్రీట్ మెంట్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా లేనిపక్షంలో తల్లికి బిడ్డకి ఇద్దరకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications











