స్విమ్‌షూట్‌లో చూసేవారికి సెగ పుట్టించిన మోడల్
ప్రపంచంలో ఉన్న టాప్ సూపర్ మోడల్స్‌లలో ఆమె ఒకరు. మోడల్ రంగానికే వన్నెవచ్చింది అంటే ఆమె వల్లనే అని చెప్పాలి.. ఇంతకీ ఎవరా ఆమె అని అనుకుంటున్నారా.. ఆస్ట్రేలియా సూపర్ మోడల్ మిరందా కెర్. ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చినా కూడా తిరిగి తన బికినీ బాడీ షేప్‌ని తెచ్చుకోగలిగారు మిరందా కెర్. మిరందా కెర్ క్యాట్ వాక్ రంగానికి నూతన అర్దాన్ని తీసుకొని వచ్చారు అని చెప్పడంలో ఎటువంటి సందేహాం లేదు. ఇటీవలే ఆస్ట్రేలియా డిపార్ట్ మెంటల్ స్టోర్స్ అయినటువంటి 'డేవిడ్ జోన్స్' సంస్దకు మిరందా కెర్ చేసినటువంటి ఫ్యాషన్ షో చూపరులను బాగా ఆకట్టుకుంది.
అసలు ఈ ఫ్యాషన్‌లో మిరందా కెర్ ఇచ్చినటువంటి ఫోజు జేమ్స్ బాండ్ సినిమాలో బాండ్ గర్ల్ మాదరే ఉందనడంలో సందేహాం లేదు. అంతేకాకుండా ఈ డ్రస్సులో మిరందా కెర్‌ని చూడడానికి రెండు కళ్లు చాల్లేదు అంటే నమ్మండి. ఈ ఫ్యాషన్‌లో మిరందా కెర్ బ్లాక్ కలర్ కలిగినటువంటి స్విమ్ షూట్ మాదిరి డ్రస్సు, ఆ డ్రస్సు పై భాగాన పసుపు కలర్ బెల్ట్ చూపరులను ఇట్టే కట్టి పడేసింది. తన బిడ్డకు జన్మనిచ్చి సంవత్సరం అవ్వకముందే మిరందా కెర్ ఇంత నాజూగ్గా ఎలా తయారైందనేది ఎవరికి అర్దం కాలేదు.
మిరందా కెర్ జనవరిలో బిడ్డకు జన్మనిచ్చింది. పేరు ప్లయిన్. ఆరు నెలల్లో మరలా తిరిగి మీ శరీరాన్ని అంతలా ఎలా తగ్గించారు అని ప్రశ్నించగా అందుకు మిరందా కెర్ మాట్లాడుతూ ప్రతిరోజు నేను చేసినటువంటి యోగా, జాగింగ్ నా శరీరాన్నిఇలా ఉంచాయని తెలిపారు.


Click it and Unblock the Notifications











