మాకు పుట్టబోయే మొదటి బిడ్డ ఇన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా..
మొదట పుట్టబోయే బిడ్డగురించి తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తులు తీసుకుంటారు. ఇది ఓ పేదవాడి దగ్గర నుండి ఓ పెద్దింటి వారి వరకు నగ్నసత్యం. వారి వారి తాహాతులను బట్టి తమకు పుట్టబోయే బిడ్డగురించి జాగ్రత్తలు తీసకుంటారు. సూపర్ మోడల్ మిరందా కెర్ కూడా మొట్టమొదటి సారి తన బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నారు. ఇందులో భాగంగానే తన భర్త ఓర్లాండ్ బ్లూమ్ మరియు తను కలసి తనకు పుట్టబోయేటటువంటి బిడ్డ గురించి రాబోయే కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇద్దరూ ప్రణాళికలు వేసుకుంటున్నారని సమాచారం.
దీనికి గాను ఈజంట తన దేశం ఆస్ట్రేలియా నుండి లాస్ ఏంజిల్స్ కురావడం జరిగింది. ముందుగానే తనబేబి గురించి డాక్టర్స్ వద్ద తగు జాగ్రత్తులు తీసుకుంటున్నారంట. ఈసందర్బంగా ఓర్లాండ్ బ్లూమ్ మాట్లాడుతూ మాకు పుట్టబోయేటటువంటి బిడ్డకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే మిరందా కెర్ న్యూయార్క్ లోఉన్నటువంటి సింగిల్ బెడ్ రూమ్ ప్లాటుని 1.4మిలియన్ డాలర్ల అమ్మకానికి ఉంచడం జరిగిందని అన్నారు. అటు తర్మాత నేను మిరందా కెర్ కాలిఫోర్నియా కివెళ్శడానికి సిద్దంగా ఉన్నామన్నారు.


Click it and Unblock the Notifications











