షో ఆగిపోవడంతో భోరుమంటున్న 'మిస్చా బార్టన్'
CW ఛానెల్ లో తాను నిర్వహిస్తున్న 'ది బ్యూటిఫుల్ లైఫ్' ప్రోగ్రమ్ గ్రాండ్ సక్సెస్ అయి తన జీవితాన్ని కూడా బ్యూటిఫుల్ చేస్తుందని ఆశపడిన ఆ షో నిర్వహిస్తున్న మిస్చా బార్టన్ ఆశలు అడిఆశలయ్యాయి. కేవలం రెండే ఎపిసోడ్ లు ప్రసారమయిన ఈ ప్రోగ్రామ్ సరైన స్పందన లేని కారణంగా నిలిపివేస్తున్నట్టు టీవీ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో 23 ఏళ్ల బార్టన్ తన కెరీర్ పై ఆందోళనగా వున్నారట. బాగా డిప్రెషన్ లోకి వెళ్లినట్టు తెలిసింది. ఈ షోని తానెంతో చక్కగా నిర్వహిస్తున్నా సరైన ప్రచారం లేకనే స్పందన కరువైందని, ఇప్పుడు తానేమి చెయ్యాలని కన్నీరుమున్నీరు అవుతోందట. ఇదేమీ నీ జీవితానికి అంతం కాదు, ఇంకా చాలా జీవితం వుంది అంటూ ఆమె తల్లి, సన్నిహితులు ఊరడిస్తున్నా ఆమె ఆందోళన తగ్గటం లేదట.
మిస్చా బార్టన్ ది బ్యూటిఫుల్ లైఫ్ టీవీ షో వాషింగ్టన్ mischa barton the beautiful life hollywood tv show washington


Click it and Unblock the Notifications