న్యూయార్క్ వదలి పోలేను అంటున్న మిస్చా బార్టన్
అమెరికా బుల్లి తెర నటి మిస్చా బార్టన్ తను చేస్తున్న 'ది బ్యూటీఫుల్ లైఫ్' షో పెద్ద హిట్ అయి తన జీవితాన్ని కూడా బ్యూటిఫుల్ చేస్తుందని ఆశపడింది. కానీ ఆ షో కాస్త ఆగిపోవడంతో నిరాశపడింది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందనే వార్తలు వినిపించాయి. అంతే కాకుండా ఆమె న్యూయార్క్ నుండీ వెళ్లిపోనుందనే వదంతులు దావాలనంగా వ్యాపించాయి. కానీ ఈ వార్తలను ఆమె ఖండించారు.
తాను పుట్టి పెరిగిన న్యూయార్క్ ను వదలి వెళ్లే ప్రసక్తే లేదని, అసలు తనకా ఆలోచన కూడా లేదని చెప్పింది. తనకు న్యూయార్క్ లో మంచి మిత్రులు వున్నారని, న్యూయార్క్ నగరం వుండటానికి ఎంతో సౌకర్యవంతంగా వుంటుందని చెప్పుకొచ్చింది. తన భవిష్యప్రణాళిక గురించి మాట్లాడుతూ తను చెయ్యాలనుకున్నవి చాలా వున్నాయని, ప్రస్తుతం సినిమాల గురించి ఆలోచిస్తున్నానని వివరణ ఇచ్చింది. బుల్లి తెరపై ఖంగుతిన్న ఈ భామ వెండి తెరపై అయినా విజయవంతం కావాలని కోరుకుదాం.


Click it and Unblock the Notifications