వేశ్యగా అవతారం ఎత్తిన హోమ్లీ గర్ల్..!!
తన గ్లామర్ మరియు క్లాసికల్ లుక్స్ తో ఇంత కాలం CW సీరీస్ 'ది బ్యూటిఫుల్ లైఫ్' లో 'సొంజా స్టోన్' పాత్రలో ఇడిపోయిన మిస్చా బార్టన్ ఇప్పుడు తనకున్న క్లీన్ అండ్ హోమ్లీ గర్ల్ ఇమేజ్ నుండీ బయటకు వచ్చి దానికి పూర్తిగా భిన్న దృవమయిన వేశ్య పాత్రలో నటించనుంది. టివి గైడ్ అందించిన సమాచారం ప్రకారం మిస్చా 'లా & ఆర్డర్: SUV' లో గ్లెయిడ్స్ అనే ఓ వేశ్య పాత్రను పోషిస్తోంది.
దీనిపై మరిన్ని వివరాలు వెళ్లడించేందుకు SUV ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నెయిల్ బెయిర్ నిరాకరించారు. కానీ మిస్చా బార్టన్ ఇందులో ఓ వేశ్య పాత్రలో నటిస్తోంది అనే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో అంగీకరించారు. ఆమె పాత్ర చిత్రణ ఎలా వుండబోతోంది, ఆమె ఎలా కనిపించనుందనే ఆశక్తి అందరిలోనూ ఉందని, కానీ తనిప్పుడా విషయాలను వెళ్లడించలేనని మరిన్ని వివరాల కోసం మార్చి 3వ తారీఖు వరకూ ఆగాల్సిందే అని మెలిక పెట్టారు. ఎందుకంటే ఈ షో మార్చి 3 నుండీ ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











