అమ్మాయిలతో ముద్దు సన్నివేశాలే బావుంటాయి...!!
CW ఛానెల్ లో తాను నిర్వహిస్తున్న 'ది బ్యూటిఫుల్ లైఫ్' ప్రోగ్రమ్ ద్వారా లైమ్ లైట్ లోకి రావాలని ప్రయత్నించి సరైన స్పందన లేని కారణంగా ఆ షోని ఆపేయడంతో మిస్చా బార్టన్ ఆశలు అడిఆశలయ్యాయి. ఆ తర్వాత ఏదోలా అందరి దృష్టిని తన వైపు తిప్పుకోవాలనుకున్న మిస్చా ఇటీవల ఓ సంచలనమైన ప్రకటన చేసి అందరినీ ఆకర్షిద్దామని చూసింది.
కానీ ఈ వార్త అనుకున్నంత సంచలనం కాకపోవడంతో మరోసారి నిరాశపడిందట. ఇంతకీ ఆమె చెప్పిన విషయమేమిటంటే అబ్బాయిలని ముద్దు పెట్టుకోవడం కన్నా అమ్మాయిలని ముద్దు పెట్టుకోవడం తనకి చాలా ఇష్టమని, సినిమాల్లో కూడా అలాంటి సన్నివేశాల్లో నటించడమే తనకు చాలా సౌకర్యవంతంగా వుంటుందని చెప్పింది.
కాగా ఇంతకు ముందు ఈమె నటించిన 'ది ఓసి' మరియు 'యు & ఐ' సినిమాల్లో ఆమె అమ్మాయిలను ముద్దు పెట్టుకునే సన్నివేశాలు వున్నాయి. ఈ సన్నివేశాల్లో నటించినప్పుడు దాన్ని తనెంతో ఆశ్వాదించానని, కానీ అబ్బాయిలను ముద్దు పెట్టుకునే సన్నివేశాల్లో నటించడానికి తను ఇబ్బంది పడతానని చెప్పుకొచ్చింది.
ఈ ప్రకటనతో తను తిరిగి లైమ్ లైట్ లోకి రావచ్చని భావించిన మిస్చా ఈ వార్తను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో నిరాశపడుతోందట. పాపం సెలబ్రిటీలు అందరి దృష్టిని ఆకర్షించడానికి ఎంత కష్టపడుతున్నారో అని ఈ వార్త విన్న వారంతా జాలి పడుతున్నారట.


Click it and Unblock the Notifications











