ఇండియన్ బాక్సాఫీసులో రికార్డుల మోత..!!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అవతార్ లాంటి హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా తర్వాత వచ్చిన సూపర్ హిట్ బాక్సాఫీసు మూవీ 'మిషన్ ఇంపాజబుల్ 4: గోస్ట్ ప్రోటోకాల్'. టామ్ క్రూయిజ్ హీరోగా ఇండియన్ ధియేటర్లలలోవిడుదలైన ఈ సినిమా 19.05 కొట్లను వసూలు చేసింది. ఈ వసూళ్లు కేవలం మూడు రోజులవి మాత్రమే. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన 'పప్పు కాన్ట్ డాన్స్ సాలా' సినిమాతో పొల్చితే టామ్ క్రూయిజ్ నటించిన ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం.
హిందీ వర్సన్‌తో పాటు మిగిలిన భాషలలో కూడా 'మిషన్ ఇంపాజబుల్ 4: గోస్ట్ ప్రోటోకాల్' సినిమాని విడుదల చేయడం జరిగింది. హిందీ వర్సన్‌లో మొత్తం ఈ సినిమా 15 కోట్ల రూపాయలను వసూలు చేయగా, అదే ప్రాంతీయ భాషలలో 3 కోట్ల రూపాయలతో పాటు, ప్రివ్యూ చెల్లింపులు 1 కోటి రూపాయలను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో విడుదలైన హాలీవుడ్ సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా టామ్ క్రూయిజ్ 'మిషన్ ఇంపాజబుల్ 4: గోస్ట్ ప్రోటోకాల్' బాక్సాఫీసు రికార్డుని నమోదు చేసింది.
'మిషన్ ఇంపాజబుల్ 4: గోస్ట్ ప్రోటోకాల్' సినిమా కోసం గాను టామ్ క్రూయిజ్ ప్రపంచంలో ఎత్తైన బుర్జి దుబాయ్ నుండి సాహాసోపేత విన్యాసాలు కూడా చేయడం జరిగింది. ఈ సినిమాలో టామ్ క్రూయిజ్ హీరోగా నటించగా అతని సరసన హీరోయిన్‌గా పాలా పాటన్ నటించారు. ఈసినిమాలో విలన్‌గా జెరెమీ రెన్నర్ తన దైన శైలిలో నటనలో టామ్‌కి గట్టి పోటీనిచ్చారు. ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 15న విడుదల చేశారు. ఈ సినిమాకి దర్శకత్వం బ్రాడ్ బర్డ్ వహించారు.


Click it and Unblock the Notifications











