Tom Cruise: నోరు వెళ్లబెట్టేలా స్టార్ హీరో ఒరిజినల్ స్టంట్స్.. 13 వేల సార్లు అలా.. కళ్లు చెదిరేలా వీడియో

టామ్ క్రూజ్.. ఈ హాలీవుడ్ హీరో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయ ఉండకపోవచ్చు. కానీ మూవీ లవర్స్ కు మాత్రం అతని సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఏ హీరో చేయని ఒరిజినల్ యాక్షన్ స్టంట్స్ చేసి ప్రతిసారి అబ్బురపరుస్తాడు. యంగ్ ఏజ్ లో రియల్ స్టంట్స్ చేసి ఆశ్చర్యపరచి ఉండొచ్చు అనుకునేవారికి 60 ఏళ్ల వయసులోనూ ఎవరు ఊహించని స్టంట్స్ చేస్తూ అదరొగొడుతున్నాడు ఈ హాలీవుడ్ యాక్షన్ మాన్ స్టర్. టామ్ క్రూజ్ కు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజీ. ఈ సిరీస్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్ సినిమా షూటింగ్ లో టామ్ క్రూజ్ చేసిన యాక్షన్ స్టంట్స్ వీడియోను తాజాగా పంచుకున్నాడు.

సూపర్ బూస్ట్ ఇచ్చిన మూవీ..

సూపర్ బూస్ట్ ఇచ్చిన మూవీ..

హాలీవుడ్ యాక్షన్ బ్లాస్టర్ టామ్ క్రూజ్ చివరిగా నటించిన టాప్ గన్ మేవరిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటివరకు నష్టాల్లో కూడా సాగుతున్న హాలీవుడ్ ఇండస్ట్రీకి ఆ సినిమా సూపర్ బూస్ట్ ఇచ్చింది. అయితే ఆ సినిమాకు అంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఈ హీరో ఇదివరకే చాలాసార్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

సినీ లవర్స్ కి పండగే..

సినీ లవర్స్ కి పండగే..

ఇదిలా ఉంటే టామ్ క్రూజ్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసిన మూవీ ఫ్రాంచేజీ మిషన్ ఇంపాజిబుల్. ఈ సిరీస్ నుంచి ఒక సినిమా వస్తుందటే సినీ ప్రియులకు పండగే. 1996లో స్టార్ట్ అయిన ఈ మూవీ ఫ్రాంచైజీ నేటికి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు సినిమాలు వచ్చి తెగ అలరించడమే కాకుండా అత్యధిక వసూళ్లు సాధించి రికార్డ్ నెలకొల్పాయి. ఇప్పుడు తాజాగా ఏడో సినిమాగా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ రానుంది.

సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే సీన్స్..

సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే సీన్స్..

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా తదితర కారణాలతో ఆలస్యం అవుతూ వస్తోంది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో ఏడో సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు జూలై 14, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో ఈథన్ హంట్ గా టామ్ క్రూజ్ వేట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విచిత్రమైన గెటప్స్ వేస్తూ పోరాట సన్నివేశాలతో సీట్ ఎడ్జ్ లో కూర్చుండబెడతాడు టామ్ క్రూజ్.

సాహసాలతో నిత్యం ట్రీట్..

సాహసాలతో నిత్యం ట్రీట్..

ఇలా ప్రపంచవ్యాప్తంగా తనదైన అద్భుత విన్యాసాలతో రియల్ హీరోగా మంచి గుర్తింపును అందుకున్న టామ్ క్రూజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో టామ్ ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా అందులో ఏదో ఒక అద్భుతమైన కంటెంట్ ఉంటుంది అనే చెప్పాలి. తన సాహసాలతో నిత్యం అభిమానులకు షాక్ ఇచ్చే ఈ దిగ్గజ హీరో ఈసారి మరొక కళ్లు చెదిరే వీడియోను పోస్ట్ చేశాడు.

విమానం నుంచి దూకే..

విమానం నుంచి దూకే..

టామ్ క్రూజ్ షేర్ చేసిన 9 నిమిషాల 22 సెకన్ల నిడివి గల వీడియోలో మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ షూటింగ్ కు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ఇందులో సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం వేసిన సెట్లు, డైరెక్టర్ తో టామ్ క్రూజ్ చర్చలు, అతను చేసిన విన్యాసాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. అందులో విమానం నుంచి దూకే సన్నివేశాలు ఉన్నాయి. మేము ఎలా పని చేశామో మీతో షేర్ చేసుకోవడం చాలా ఎక్జైటింగ్ గా ఉందని వీడియో ట్వీట్ చేస్తూ రాసుకొచ్చాడు టామ్.

13 వేల మోటర్ క్రాస్ జంప్స్..

ఈ వీడియాలో యాక్షన్ సీన్స్ బాగా వచ్చేందుకు రోజుకు 30 సార్లు టామ్ క్రూజ్ దూకేవారని చెప్పుకొచ్చారు. అలాగే 500 సార్లు స్కై డైవ్స్, 13000 మోటర్ క్రాస్ జంప్స్ ను టామ్ క్రూజ్ చేశాడని వీడియోలో తెలిపారు. ఇదంతా చాలా ఫన్ గా ఉంటుందని టామ్ క్రూజ్ చెప్పడం విశేషం. అత్యంత ఎత్తైనా బ్రిడ్జ్ పై నుంచి మోటర్ సైకిల్ తో టామ్ క్రూజ్ కిందకు దూకడం, విమానంలోనుంచి జంప్ చేయడం తదితర సన్నివేశాలు థ్రిల్లింగ్ కు గురి చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X