Mission Impossible Premiere Review.. దిమ్మతిరిగే యాక్షన్ ఎపిసోడ్.. ట్రామ్ క్రూజ్ అదుర్స్.. క్రిటిక్స్ రివ్యూ
హాలీవుడ్ సూపర్ స్టార్ ట్రామ్ క్రూజ్ హీరోగా స్కైడ్యాన్స్, టీసీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై క్రిస్టఫర్ మాక్వరీ దర్శకత్వంలో టామ్ క్రూజ్ నిర్మించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ పార్ట్ 1 (Mission: Impossible - Dead Reckoning Part One) చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందింది. బ్రూస్ గెల్లెర్ రూపొందించిన మిషన్: ఇంపాజిబుల్ చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.అయితే రోమ్ నగరంలో ఈ సినిమా ప్రివ్యూ ప్రదర్శించగా బ్రహ్మండమైన రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా ప్రివ్యూ, ఇతర వివరాల గురించిన విషయాల్లోకి వెళితే..
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ పార్ట్ 1 చిత్రం అమెరికన్ స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. మిషన్ ఇంపాజిబుల్: ఫాలౌట్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్నది. టామ్ క్రూజ్, హేలే అట్‌వెల్, వింగ్ రామేస్, షిమోన్ పెగ్, రెబెకా ఫెర్గ్యూసన్, ఎసై మోరేలెస్, వెనెస్పా కిర్బీ తదితరులు నటించారు. అయితే ఈ సినిమాను జూలై 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.

మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ పార్ట్ 1 (Mission: Impossible - Dead Reckoning Part One) చిత్ర కథ విషయానికి వస్తే. మానవాళిని అంతం చేసే కుట్ర పన్నిన దుష్ట శక్తులను ప్రయత్నాలను విఫలం చేసేందుకు ఎథాన్ హంట్ (టామ్ క్రూజ్) తన ఐఎంఎఫ్ టీమ్‌తో రంగంలోకి దిగుతాడు. మానవాళి వినాశానికి సిద్దం చేసిన డేంజరస్ ఆయుధాన్ని కనుకొనేందుకు టీమ్ రేస్‌ను మొదలుపెడుతుంది. అయితే దుష్ట శక్తులపై ఎథాన్ హంట్ ఎలా విజయం సాధించాడనేది కథగా రూపొందింది.

మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ పార్ట్ 1 (Mission: Impossible - Dead Reckoning Part One) సినిమాను రోమ్ నగరంలో జూన్ 20వ తేదీన ప్రీమియర్‌గా ప్రదర్శించారు. ఈ సినిమాకు భారీ రెస్సాన్స్ వస్తున్నది. ఈ సినిమాపై క్రిటిక్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ పార్ట్ 1 (Mission: Impossible - Dead Reckoning Part One) స
సినిమా గురించి స్క్రీన్ రైటర్ జోసెఫ్ డెకెల్‌మియర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఫినామినల్‌గా ఉంది. హేలే ఎట్‌వెల్ తన అద్బుతమైన నటనతో ఆకట్టుకొన్నది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో నాకు ఫేవరేట్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్ ప్రధాన విలన్‌గా ఉంది. అద్బుతమైన కథతో రూపొందించారు. యాక్షన్ సీన్లు అద్బుతంగా ఉన్నాయి. ట్రైన్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది అని అన్నారు.

సినీ ప్రముఖుడు ఎరిక్ డెవిస్ మాట్లాడుతూ.. మిషన్ ఇంపాజిబుల్ సినిమా చూసి అద్బుతమైన అనుభూతికి గురయ్యాను. నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. సుదీర్ఘంగా సాగే యాక్షన్ సీన్లు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ప్రతీ సీన్‌లో ఏం జరుగబోతుందనే ఉత్కంఠ ఉంటుంది. వచ్చే సీన్లలో ఏం జరుగబోతుందనే ఆతృత ప్రేక్షకుడిని వెంటాడుతుంటుంది అని అన్నారు.
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ పార్ట్ 1 (Mission: Impossible - Dead Reckoning Part One) చిత్రం బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా. మిషన్ చాలా ఆర్బాటంగా మొదలైంది. రోమ్ నగరంలో ప్రదర్శించిన ప్రీమియర్‌కు టామ్ క్రూజ్ హాజరయ్యారు. ఈ సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది అని క్రిటిక్స్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











