ప్రాణాలకు తెగించిన ట్రామ్ కూయిజ్..డూప్ లేకుండా.. మన హీరోలకు సాధ్యమేనా?
Recommended Video

టామ్ క్రూయిజ్... ప్రపంచ సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. హాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన ఈ స్టార్ సినిమా కోసం ఎంతటి రిస్కీ షాట్స్ అయినా డూప్ లేకుండా చేసే నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. టామ్ క్రూయిజ్ నటించిన తాజా సినిమా 'మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్' తాజాగా విడుదలైన బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచే ఎపిసోడ్.... క్లైమాక్స్‌లో వచ్చే హెలికాప్టర్ చేజింగ్ సీన్. దీంతో పాటు మిలటరీ ప్లెయిన్ నుండి టామ్ స్కైడైవింగ్ చేసే సీన్ సైతం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది.

రియల్‌గా చేసిన టామ్ క్రూయిజ్
ఈ సినిమాలోని స్టంట్స్ అన్నీ కూడా టామ్ క్రూయిజ్ ఎలాంటి డూప్ లేకుండా రియల్ గా చేశాడు. క్లైమాక్స్‌లో వచ్చే హెలికాప్టర్ చేజింగ్ సీన్లో కూడా చాపర్ నడిపింది కూడా అతడే. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. విమానం నుండి జంప్ చేసే సీన్ సైతం స్వయంగా అతడే చేయడం గమనార్హం.
25 వేల అడుగుల నుండి హాలో జంప్
ఓ సీన్లో టామ్ క్రూయిజ్ 25 వేల అడుగుల ఎత్తు నుండి హాలో (హై ఆల్టిట్యూడ్, లో ఓపెనింగ్) స్కై డైవ్ చేశాడు. సినిమా కోసం ఇలాంటి జంప్ చేసిన తొలి హీరోగా టామ్ క్రూయిజ్ చరిత్రకెక్కాడు. టామ్ క్రూయిజ్‌తో పాటు కెమెరామెన్ కూడా జంప్ చేసి ఈ సీన్ చిత్రీకరించారట. సన్ సెట్ సమయంలో తీసే ఈ సీన్ బాగా రావడం కోసం.... అనేక సార్లు జంప్ చేసి అందులోని బెస్ట్ సీన్‌ను సినిమాలో పెట్టారట. ఈ విషయాన్ని దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సినిమా కోసం హెలికాప్టర్ నడపటం నేర్చుకున్న టామ్ క్రూయిజ్
ఇక ‘మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్' మూవీలో హైలెట్ క్లైమాక్స్‌లో వచ్చే హెలికాప్టర్ చేజింగ్ సీన్. ఇందుకోసం టామ్ క్రూజియ్ స్వయంగా హెలికాప్టర్ నడపటం నేరుకున్నాడు. సాధారణంగా రోజుకు 8 గంటల చొప్పున 3 నెలల పాటు శిక్షణ తీసుకుని లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. కానీ టామ్ క్రూయిజ్ రోజుకు 16 గంటల పాటు ఆరు వారాలు శిక్షణ తీసుకుని లైసెన్స్ పొందాడట.

స్టంట్స్ చేసే క్రమంలో గాయాలు
స్టంట్స్ చేసే క్రమంలో టామ్ క్రూయిజ్ అనేక సార్లు గాయాల పాలయ్యాడు. ఒక బిల్డింగ్ నుండి మరొక బిల్డింగ్ మీదకు దూకే క్రమంలో అతడి అంకెల్(చీలమండలం)కు తీవ్రమైన గాయం అయింది. దీంతో అతడు తప్పనిసరి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో మొత్తం ప్రొడక్షన్ షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి వచ్చిందట.

మన హీరోలకు ఇలాంటివి సాధ్యమేనా?
మన ఇండియాలోనూ సినిమా కోసం డెడికేటెడ్‍గా, డూప్ లేకుండా స్టంట్స్ చేసే హీరోలు ఉన్నారు కానీ... టామ్ క్రూయిజ్ స్థాయిలో ప్రాణాలు పనంగా పెట్టి స్టంట్స్ చేసే సాహసం అయితే ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. మరి హాలీవుడ్ స్థాయిలో అత్యాధునికమైన సెటప్ ఉంటే.... ఇండియాలోనూ టామ్ క్రూయిజ్ లాంటి స్టార్స్ పుట్టుకొస్తారేమో?


Click it and Unblock the Notifications











