ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలతో ‘మిషన్ ఇంపాజబుల్-ఫాలౌట్’ (తెలుగు ట్రైలర్)

By Bojja Kumar

హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రాల్లో మిషన్ ఇంపాజబుల్ సిరీస్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. జేమ్స్ బాండ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని భారీ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కే ఈ చిత్రాల్లో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఈ సిరీస్ 6వ చిత్రంగా తెరకెక్కిన 'మిషన్ ఇంపాజబుల్-ఫాలౌట్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండియాతో పాటు యూఎస్ఏలో జులై 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలో వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ సినిమాను హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.

Mission: Impossible – Fallout release on July 27 in India

మెక్ క్వారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే గత 5 సిరీస్ చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ విజుల్స్ పరంగా భిన్నంగా ఉండేలా, తన మార్కు కనబడేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడట. ఇటీవల ఇంటర్వ్యూలో మెక్ క్వారీ మాట్లాడుతూ... విజువల్స్ పరంగా చాలా మార్పులు చేశాం. మిషన్‌ ఇంపాజిబుల్-ఫాలౌట్‌'కు దర్శకుడు వేరే అని తెలియాల‌న్న‌ది నా ఫీలింగ్‌ అని వ్యాఖ్యానించారు.

దర్శకుడి గురించి హీరో టామ్ క్రూయిజ్ మాట్లాడుతూ... మెక్ క్వారీతో 'జాక్ రిచ‌ర్‌' మూవీ చేసినపుడే అతడి ప్రతిభ ఏమిటో అర్థమైందని, మిషన్ ఇంపాజబుల్-ఫాలౌట్ మూవీ గత చిత్రాలకంటే భిన్నమైన, అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని, అభిమానులకు పూర్తి సంతృప్తిని ఇస్తుందన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X