మైఖేల్ జాక్సన్ 'ట్రిపంత్ టూర్' ని తెర మీద..!
ప్రముఖ పాప్ మాంత్రికుడు దివంగత మైఖేల్ జాక్సన్ ప్రపంచాన్నంతటినీ తన పాటలతో ఓ ఊపు ఊపాడు. ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు చెప్పుకోని డబ్బులు సంపాదించడానికి రెడీ అయ్యారు. 1981లో మైఖేల్ జాక్సన్ రూపోందించినటువంటి 'ట్రిపంత్ టూర్' అనే ఆల్బమ్ ఆయనకి చాలా పేరు సంపాదించిపెట్టింది. ఇప్పుడు ఆ ట్రిపంత్ టూర్ కి సంబంధించిన మైఖేల్ జాక్సన్ రిహార్సల్ ను తెర మీద చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
రాన్ న్యూట్ ఇతను మైఖేల్ జాక్సన్ కి అత్యంత సన్నిహితుడు. రాన్ న్యూట్ మాట్లాడుతూ మైఖేల్ జాక్సన్ చనిపోవడానికి ముందు రూపోందించినటువంటి 'దిస్ ఈజ్ ఇట్' ఎలాంటి స్పందన వచ్చిందో మన అందరికి తెలుసు. అభిమానుల గుండెల్లో మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే వున్నాడు. అలాంటి అబిమానులకోసం మేము 'ట్రిపంత్ టూర్' కి సంబంధించిన మైఖేల్ జాక్సన్ రిహార్సల్ ను 64 నిమిషాల నిడివిగల సినిమాగా విడుదల చెయ్యడానికి సిధ్దంగా ఉన్నామన్నారు. ఇందులో మైఖేల్ జాక్సన్ ఎలా పాడారో, ఎలా డాన్స్ వేశారో, సాంగ్ ని ఎలా డైరెక్ట్ చెశారో మొదలగు అంశాలు ఉంటాయన్నారు.


Click it and Unblock the Notifications











