మైఖేలా మజాకా...!!
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ చివరి సారిగా తన లండన్ షో కోసం డాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోలను 'దిస్ ఈజ్ ఇట్' అనే ఓ డాక్యుమెంటరీగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండు గంటలు వ్యవధి గల ఈ డాక్యుమెంటరీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలయిన ఐదు రోజుల్లోనే 474 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 281 కోట్ల రూపాయలకు ఈ డాక్యుమెంటరీని కోనుగోలు చేసిన సోనీ సంస్థ వచ్చిన లాభాలను ఆదివారం ప్రకటించింది.
కాగా ఈ డాక్యుమెంటరీ వసూళ్లలో సగం వాటా అమెరికాలోనే రావడంతో పాటు, ప్రేక్షకుల నుండీ వస్తున్న అద్భుతమైన స్పందనను చూసి తొలుత అమెరికాలో రెండు వారాలే ప్రదర్శించాలనుకొన్న ఈ సినిమాని ఇప్పుడు మూడు వారాల పాటు ప్రదర్శించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సోనీ సంస్థ ప్రకటించింది. దటీజ్ మైఖేల్...!!
మైఖేల్ జాక్సన్ హాలీవుడ్ దిస్ ఈజ్ ఇట్ పాప్ రారాజు సోనీ పిక్చర్స్ pop king michael jackson this is it hollywood sony pictures


Click it and Unblock the Notifications