మైఖేల్ జాక్సన్ ను మించిపోయిన టేలర్ స్విఫ్ట్
యువ పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్ పాప్ సంగీత చక్రవర్తిగా అందరి అభిమానాన్ని చూరగొన్న దివంగత మైఖేల్ జాక్సన్ ను మించిపోయింది. గత ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో గల నోకియా థియేటర్లో ప్రకటించిన అమెరికన్ మ్యూజిక్ అవార్డుల్లో మైఖేల్ జాక్సన్ నాలుగు విభాగాల్లో అవార్డులను పొందగా, యువ పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్ 'ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డుతో మొత్తం అయిదు విభాగాల్లో విజేతగా నిలిచింది. జూన్ 25న మరణించిన మైఖేల్ జాక్సన్ ఈ అవార్డుల్లో నాలుగు విభాగాల్లో విజేతగా నిలిచి తను భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ సంగీతం రూపంలో బ్రతికేవున్నానని ప్రపంచానికి చాటిచెప్పాడు. ఈ అవార్డులను ఆయన తరపున సోదరుడు జర్మైన్ జాక్సన్ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ మంచినే చూసిన మైఖేల్, ప్రతి ఒక్కరూ మంచే చెయ్యాలని కోరుకున్నట్టు ఆయన సందేశాన్ని వినిపించాడు.
ఈ కార్యక్రమంలో భాగంగా లేడీ గాగా, రిహాన్నా, షకీరా, జెన్నిఫర్ లోపెజ్ తదితరులు ఇచ్చిన ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.


Click it and Unblock the Notifications











