జాక్సన్ ఎప్పుడూ సంతృప్తి చెందడు- ఏకాన్
దివంగత పాప్ మాహా రాజు మైఖేల్ జాక్సన్ ఎన్నో అద్భుతమైన ఆల్బమ్ లను రూపొందించాడు. ఎన్నో రికార్డులను సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల హృదయాల్లో కొలువయ్యాడు. వీటన్నిటి వెనుక అలుపెరుగని శ్రమ, కఠోర సాధన, ఎప్పటికీ సంతృప్తి చెందని తత్వం లాంటివి ఆయన్ని ముందుకు నడిపించాయని మరో పాప్ సింగర్ ఏకాన్ తెలిపారు. ఇటీవల ఎంటీవీ (MTV) న్యూస్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయనీ విషయాలను వెళ్లడించారు. అందరి లాగా ఆయన అంత త్వరగా తృప్తి చెందేవారు కాదని, ఇంకాస్త బెటర్ గా వచ్చేలా ట్రై చేద్దాం అనే వాడని, కష్టపడితే సాధించలేనిది ఏదీ వుండదని ఆయన నమ్మేవారని ఆయనతో కలసి వున్న రోజులను గుర్తుచేసుకున్నారు.
తామిద్దరం ఎప్పుడు కలసినా సంగీతం గురించే మాట్లాడుకొనే వారమని, ఇతర విషయాలు చాలా తక్కువ సార్లు ప్రస్తావనకు వచ్చేవని అంత అంకితభావంతో పనిచేసాడు కాబట్టే ఆయన మరణానంతరం కూడా మైఖేల్ గురించి మాట్లాడుకుంటున్నారని ఏకాన్ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











