అనుమానకర పరిస్థితుల్లో నటి మృతి.. 13 ఏళ్ల పాటు అతడితో!
సెలెబ్రిటీల జీవితాలకు సంబంధించిన అప్పుడప్పుడో చేదు నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. సెలెబ్రిటీలు ఎంత లగ్జరీ జీవితాన్ని అనుభవించినా చాలా తక్కువ సమయంలో పరిస్థితి మొత్తం తలక్రిందులుగా మారిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఒత్తిడి భరించలేక. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ పరమైన సమస్యలతో చాలా మంది సెలెబ్రిటీలు అనుమానకర పరిస్థితుల్లో మృతి చెందడం చూస్తూనే ఉన్నాం. హాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ అయిన కిమ్ పోర్టర్ గురువారం లాస్ ఏంజిల్స్ లో తన నివాసంలో అనుమానకర పరిస్థితుల్లో మరణించారు.

ఆకస్మిక మరణం
కిమ్ పోర్టర్ వయసు ప్రస్తుతం 47. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తన నివాసంలో కిమ్ పోర్టర్ మృతిచెందినట్లు ఆమె సన్నిహితులు మీడియాకు అధికారికంగా ప్రకటించారు. ఇది ఊహించని ఘటన అని పేర్కొన్నారు. కిమ్ ముగ్గురు పిల్లలకు తల్లి.

అనేక అనుమానాలు
మరి కొందరు మాత్రం కిమ్ పోర్టర్ గుండె పోటుతో మరణించి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె న్యుమోనియాతో భాదపడుతోందని కానీ ఈ విషయం ఎక్కువ మందికి తెలియదని అంటున్నారు. కానీ కిమ్ పోర్టర్ మృతికి సంబంధించిన సరైన కారణం మాత్రం ఎవరికి తెలియడం లేదు.

అతడితో 13 ఏళ్ల పాటు
కిమ్ పోర్టర్ 1989 లో అమెరికాకు చెందిన ఫిలిం ప్రొడ్యూసర్ ఎబి షూర్ ని వివాహం చేసుకుంది. 1990 లోనే అతడి నుంచి విడిపోయింది. ఆ తరువాత 1994 లో ప్రముఖ రాపర్ సీన్ కాంబ్స్ తో డేటింగ్ మొదలు పెట్టింది. వీరిద్దరి రిలేషన్ 13 ఏళ్లపాటు 2007 వరకు కొనసాగింది. వీరిద్దరికీ ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. కానీ ఈ జంట వివాహం మాత్రం చేసుకోలేదు. కాంబ్స్ నుంచి విడిపోయాక పోర్టర్ ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

కాంబ్స్ అధికార ప్రతినిధి
కాంబ్స్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ కిమ్ పోర్టర్ మరణించిన విషయాని తెలియజేయాల్సి వస్తోంది. ఈ సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు మీడియా ప్రైవసీ కల్పించాలి అని తెలిపారు. 1971 లో జన్మించిన కిమ్ పోర్టర్ ఆ తరువాత మోడలింగ్ ని వృత్తిగా ఎంచుకుంది. రన్ వే, ఎస్సెన్స్ వంటి మ్యాగజైన్స్ కు ఆమె చేసిన ఫొటో షూట్స్ బాగా పాపులర్ అయ్యాయి. కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో కూడా కిమ్ నటించింది.


Click it and Unblock the Notifications











