ఎవరెవరితో డేటింగ్ అన్న విషయం బయోగ్రఫీలో
బ్రటిష్ సూపర్ మోడల్ కేట్ మోస్ తన గురించి తానే స్వయంగా ఆటో బయోగ్రఫీ రాయనున్నారు. అందులో తాను గతంలో డేటింగే చేసినటువంటి స్టార్ హీరోలు జానీ డెప్, పీట్ దోర్తీతో పాటు, ప్రస్తుతం నా గురించి బయోగ్రపీ రాసుకోమని ప్రోత్సహించిన నా భర్త జామీ హిన్స్ ఇలా అందరితో నా రిలేషన్ షిప్ గురించి ఈ పుస్తకంలో రాయడం జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఈ పుస్తకంలో నేను ఎవరెవరితో సెక్సులో పాల్గోంది, డ్రగ్స్, బట్టలు ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తులు మొదలగు వాటికి సంబందించిన విషయాలు అభిమానులకు తెలియజేయనుంది.
కేట్ మోస్ సాధారణంగా ఇంటర్యూలు ఇవ్వడానికి పెద్ద ఆసక్తిని చూపించరు. తన జీవితంలో జరిగేటటువంటి విషయాలు, తన పర్సనల్ లైప్ గురించి పెద్దగా అబిమానులకు తెలియకపోవడంతో, ఎలా తన గురించి అభిమానులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా తన ఆటో బయోగ్రఫీ రాయడానికి సిద్దపడ్డారని ఆమె ప్రతినిధి తెలిపారు. ఇది మాత్రమే కాకుండా కేట్ మోస్ ఎప్పుడూ కూడా తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న విషయం గానీ, తన కూతురు లైలా గురించిగానీ, తన మాజీ బాయ్ ప్రెండ్స్ జానీ డెప్, పీట్ దోర్తీకి సంబధించిన విషయాలు ఇంత వరకు కూడా ఎక్కడా ప్రస్తావించలేదు.
ఇవన్నీ ప్రస్తావించక పోవడం వల్లనే కేట్ మోస్ బ్రిటిష్ ఐకాన్ అయిందనే విషాయన్ని కూడా చాలా మంది ధృవపరుస్తున్నారు. ఏది ఐతేనేం ఇంత వరుక తన సీక్రెట్స్ ని బయట పెట్టని కేట్ మోస్ తన అభిమానుల కొరిక మేరకు తన గురంచి తానే స్వయంగా ఆటో బయోగ్రఫీ రాయనున్నారు.


Click it and Unblock the Notifications











