twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుస విషాదాలు: మొన్న మూర్, నిన్న దాసరి.... ఇపుడు మరో స్టార్ అస్తమయం!

    By Bojja Kumar
    |

    లండన్: సినీ రంగానికి సంబంధించిన సీనియర్ తారలంతా వరుసపెట్టి స్వర్గలోపు తలుపు తడున్నారు. ఇటీవలే మొన్నటి తరం జేమ్స్ బాండ్ హీరో రోజర్ మూర్ మరణించగా, మొన్న సాయంత్రం తెలుగు సినీ పరిశ్రమలో దాసరి అస్తమించారు. తాజాగా మరో సీనియర్ తార కన్నుమూసారు.

    ఇంగ్లిష్ నటి, మాజీ బాండ్ గర్ల్ మోలీ పీటర్స్ (75) గుండెపోటుతో కన్నుమూసారు. మార్చి 15, 1942లో జన్మించిన మోలీ పీటర్స్ మే 30, 2017న మరణించారు. ఆమెకు సంతాపం తెలుపుతూ జేమ్స్ బాండ్ మూవీ అఫీషియల్ పేజీ ద్వారా ట్వీట్ చేసారు.

    థండర్ బాల్

    థండర్ బాల్

    1965లో వచ్చిన జేమ్స్ బాండ్ సిరీస్ మూవీ ‘థండర్‌బాల్' లో సీన్ కానరీ సరసన మోలీ పీటర్స్ నటించారు. ఈ సినిమా తర్వాత ఆమె థండర్ బాల్ మోలీగా పాపులర్ అయ్యారు.

    మారుమూల గ్రామంలో పుట్టి

    మారుమూల గ్రామంలో పుట్టి

    ఇంగ్లండ్ లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన మోలీ అందం, తెలివితేటలున్న అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. మోడల్ చేస్తున్న సమయంలోనే ఆమె జేమ్స్ బాండ్ డైరెక్టర్ టెరెన్స్ యంగ్ దృష్టిలో పడింది.

    ‘థండర్‌బాల్' అవకాశం

    ‘థండర్‌బాల్' అవకాశం

    టెరెన్స్ యంగ్...మోలీని స్క్రీన్ టెస్ట్ చేసి ఆమెనే తను తెరకెక్కిస్తున్న ‘థండర్ బాల్' సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. అలా 23ఏళ్ల వయసులోనే జేమ్స్ బాండ్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది మోలీ.

    తక్కువ సినిమాలే

    మెలీ పీటర్స్ తన కెరీర్లో కేవలం 6 సినిమాల్లో మాత్రమే నటించారు. తర్వాత రెండు టీవీ సిరీయల్స్ లో నటించారు.

    English summary
    English actress and former Bond Girl Molly Peters of Thunderball fame has died at the age of seventy-five, as of May 30, 2017. Born on March 15, 1942, Peters was a lifelong resident of Suffolk who found her way into the world that is the entertainment industry by way of director Terence Young – who discovered a young Peters then working as a model in the mid-twentieth century.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X