షో నుండి నిషేధం.. ఎందుకో తెలియదు
బ్రిటిష్ టివి హోస్ట్ పీయర్స్ మోర్గాన్ తన రియాలిటీ షో నుండి హాలీవుడ్ పాప్ స్టార్ మడోన్నా నిషేధించాడు. ఐతే మడోన్నాని తన షో నుండి తొలగించడానికి గల కారణాలను మాత్రం వెల్లడించ లేదు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. మోర్గాన్ ట్విట్టర్ ఎకౌంట్లో 'ట్విట్టర్‌కు స్వాగతం. లవ్ పీయర్స్ షో నుండి నిన్ను నిషేంధించానని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌ని రిసీవ్ చేసుకున్న మడోన్నా మేనేజర్ గుయ్ ఓసరీ రియల్లీ అంటూ రీ ట్వీట్ చేశాడు. అంతక ముందు బ్రిటీష్ ఛాట్ షో అయినైటువంటి 'లవ్ పీయర్స్ ఎక్స్' లో మడోన్నాని గెస్టుగా షోలో పాల్గోనాల్సిందిగా కోరారు. ఆ తర్వాత మళ్లీ పీయర్స్ కేవలం ఒక్క మడోన్నాని మాత్రమే నాయొక్క సిఎన్ఎన్ షో నుండి నిషేధించాను. యుకె షో నుండి కాదు అని ట్వీట్ చేశాడు.
ఐతే మడోన్నాకి కూడా తెలియని విషయం ఏమిటంటే అసలు షో నుండి తనని ఎందుకు నిషేధించాడనే విషయం. గతయేడాది జనవరిలో పీయర్స్ ఓ ప్రయివేటు కార్యక్రమంలో మాట్లాడుతూ 20 సంవత్సరాల నా జీవితంలో మడోన్నా చికాకుని తెప్పించిందని అన్నాడు.


Click it and Unblock the Notifications











