పాపాయికి జన్మనిచ్చిన టెలివిజన్ సూపర్ స్టార్
టెలివిజన్ పర్సనాలిటీ పీర్స్ మోర్గాన్, సెలీనా వాడెన్ దంపతులు ప్రపంచంలోకి కొత్త అందమైన పాపాయికి స్వాగతం పలికారు. పోయిన సంవత్సరంలో జూన్‌లో ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈ జంట వీరికి పుట్టిన పాపాయికి 'ఎలైస్' అని నామకరణం చేయడం జరిగింది. ఐతే ప్రస్తుతానికి తమయొక్క పాపాయికి సంబంధించిన పూర్తి సమచారాన్ని త్వరలోనే అందిస్తామని పీర్స్ మోర్గాన్ పత్రికా సమావేశంలో భాగంగా తెలిపారు.
46 సంవత్సరాలు వయసు కలిగిన పీర్స్ మోర్గాన్, సెలీనాకు పుట్టినటువంటి మొట్టమొదటి పాపాయి కావడంతో వీరు చాలా ఆనందంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే పీర్స్ మోర్గాన్‌కు గతంలోనే మారిన్ షిల్లాతో పెళ్లి అవడం జరిగింది. పీర్స్ మోర్గాన్ మొదటి భార్య షిల్లాకు ముగ్గురు పిల్లలు. 2008వ సంవత్సరంలో తన మొదటి భార్య షిల్లాతో కొన్ని మనస్పర్దలు కారణంగా పీర్స్ మోర్గాన్ ఆమె నుండి విడాకులు తీసుకొవడం జరిగింది.


Click it and Unblock the Notifications











