ఒలంపిక్ పార్క్‌లో ప్రత్యేకంగా డిజైన చేసిన రన్ వే పై సూపర్ మోడల్స్
లండన్, జులై 16: ఈ నెల 27 నుండి ప్రారంభం కానున్న ఒలంపిక్స్‌కు లండన్ నగరం అత్యంత వైభవంగా ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ప్రారంభంతో పాటు ముగింపు కూడా అత్యంత ఘనంగా జరపాలని లండన్ ఒలంపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లండన్ ఒలంపిక్స్ 2012 ముగింపు కార్యక్రమంలో హాలీవుడ్ సూపర్ మోడల్స్ కేట్ మోస్, నోమి క్యాంప్బెల్‌లు పాల్గోనున్నారు.
లండన్ ఒలంపిక్స్ ముగింపురోజైన ఆగస్టు 12వ తారీఖున కేట్ మోస్, నోమి క్యాంప్బెల్‌తో పాటు మోడల్ రంగం నుండి హీరోయిన్‌గా మారిన లిల్లీ కోల్, సింగర్ మైక్ జగ్గర్ కూతురు జార్జియా మే ఒలంపిక్ పార్క్‌లో ప్రత్యేకంగా డిజైన చేసిన రన్ వే మీద షో టాపర్స్‌గా నడవనున్నారు. లండన్ ఒలంపిక్స్ జులై 27న ప్రారంభమై ఆగస్టు 12తో ముగుస్తాయి.
ఈ నెల 30న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గోనే భారత క్రీడాకారుల బృందానికి రెజ్లర్ సుశీల్ కుమార్ సారథ్యం వహించనున్నాడు. ఇది ఇలా ఉంటే లండన్ ఒలంపిక్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహారిస్తున్న ఓఎన్‌జీసీ బంగారు పతకం గెలిచిన ఆటగాళ్లకు రూ 25 లక్షల నగదు పురస్కారాన్ని ఇస్తామని ప్రకటించింది. అదే విధంగా రజతం, కాంస్య పతకాలు సాధించిన ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ 15 లక్ష లు, 10 లక్షల నజరానాను అందిస్తామని పేర్కొంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











