జాక్ అండ్ జిల్ పేరుతో సినిమా....!
జాక్ అండ్ జిల్ ఇది మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యం. అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఈ పద్యం ఇంకా చదువుతూనే వున్నారు. ఇప్పుడు హాలీవుడ్ లో ఈ పద్యం పేరు మీద సినిమా రాబోతుంది. ఆడమ్ సాండ్లర్ హిరోగా నటిస్తున్న ఈ సినిమాలో కైటీ హామీస్ హిరోయిన్ గా నటిస్తున్నారు.
ఇక్కడ మనం కైటీ హామీస్ గురించి మాట్లాడుకోవాలి. కైటీ హామీస్ మంచి అందగత్తె మాత్రమె కాదు, ప్రపంచం మొత్తం తన నటనతో అభిమానులను సంపాదించుకున్న 'టామ్ క్రూయిజ్ భార్యగా 'గుర్తింపు పోందింది. బ్యాట్ మెన్ రిటర్న్స్ తర్నాత కైటీ హామీస్ కి ఆశించినంత విజయాలు దక్కలేదు. అడపాదడపా సినిమాలు తీస్తున్నప్పటికి, మంచి బాక్సా ఫీస్ హిట్ కోసం కైటీ హామీస్ ప్రయత్నిస్తున్నారు.
ఇక ఈ సినిమా కధ విషమానికి వస్తే ఇద్దరు కవల పిల్లలు మధ్య జరిగే విచిత్రమైన సన్నివేశాలు గురించి వుంటుందని, చిత్రదర్శకుడు డేనిస్ దుగాన్ వివరించారు. అలాగే ఈ సినిమాలో ఆడమ్ సాండ్లర్ చేసినటువంటి కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











