అదరకొట్టే గొరిల్లా కథే...‘మిస్టర్ గో’
హైదరాబాద్ : హాలీవుడ్‌నుండి తెలుగులో వస్తున్న మరో చిత్రం 'మిస్టర్ గో' (కొత్త సూపర్ హీరో). ఈ 4 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషాలలో ఈనెల 27న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఫిలిమ్ ఛాంబర్‌లో మీడియా సమావేశంలో ఏర్పాటుచేసారు.
ముఖేష్ మెహతా మాట్లాడుతూ...- ఓ సర్కస్ నడిపే యజమానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే బేస్‌బాల్ క్రీడలో ఆరితేరిన గొరిల్లా ఎలా ఆదుకుందీ అనే ఉత్కంఠమై కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. పిల్లలకు నచ్చే పలు అంశాలతో యాక్షన్ సెంటిమెంట్‌తోసాగే ఈ చిత్రం దాదాపు వంద 3డి థియేటర్లలో విడుదలవుతోందని తెలిపారు.

16 ఏళ్ళ పాపతో గొరిల్లా మచ్చికతో లైఫ్ అండ్ డెత్‌గా మారిన సర్కస్ కంపెనీకి తన సహకారంతో ఎలా నిలిపింది గొరిల్లా అనే కథాంశం ఆకట్టుకుంటుందని, గొరిల్లా నేపథ్యంతో వచ్చిన అనేక చిత్రాలు విజయవంతమైనట్లే ఈ చిత్రం కూడా నచ్చుతుందని ఆయన అన్నారు. హాంగ్‌కాంగ్, చైనా, మలేసియాలలో విడుదలై విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో వస్తున్నందుకు ఆనందంగా ఉందని గోగినేని బాలకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం:యంగ్ హూకిమ్.


Click it and Unblock the Notifications











