స్టిఫెన్ గ్యాట్లీ మరణం పై వీడని అనుమానాలు
ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ 'బాయ్ జోన్' సభ్యుడు పాప్ గాయకుడు, పాటల రచయిత, నటుడు 33 ఏళ్ల స్టిఫెన్ గ్యాట్లీ అక్టోబరు 10న తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ మరణం పై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. గ్యాట్లీ బాగా మద్యం సేవించినందునే మరణించాడనే వార్త ప్రస్తుతం హాలీవుడ్ లో షికారు చేస్తోంది. ఏకధాటిగా ఎనిమిది గంటల సేపు బాగా మద్యం సేవించినందునే ఆయన గుండె ఆగిపోయిందనే వార్త ప్రస్తుతం ప్రచారంలో వుంది. కానీ ఈ వార్తని గాలి వార్తగా ఆయన కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. గ్యాట్లీ తన మీద తనకు నియంత్రన కలిగిన వ్యక్తి అనీ, అతిగా మద్యం సేవించడం వల్లే మరణించాడనే వార్తలో అర్థం లేదని వారు తెలిపారు.
ఇదిలా వుండగా గ్యాట్లీ మరణంలో సంగీత ప్రపంచం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఆయన 'బాయ్ జోన్' బ్యాండ్ సహచరులు రోనా కేటింగ్, కెయిత్ డఫ్, మైకే గ్రాహమ్ మరియు షేన్ లించ్ గ్యాట్లీ మరణంలో ధిగ్భ్రాంతి చెందామని, ఓ మంచి సహచరున్ని కోల్పోయామని, ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాడ సానుభూతిని తెలియజేసారు.


Click it and Unblock the Notifications











