'మా నాన్న గే' అంటూ స్టార్ హీరో రివిల్
లాస్ ఏంజిల్స్ : ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నోరో తన తండ్రి ఓ గే అని తేల్చి చెప్పారు. ఆ విషయాన్ని ఆయన తన తల్లి,తండ్రి విడిపోయాక తెలిసిందని చెప్పారు. తన తండ్రి వేరే వ్యక్తితో ఉండేవాడిని అన్నారు. రాబర్ట్ డీ నీరో తండ్రి ఓ అబ్ స్ట్రాక్ట్ పెయింటర్. ఆయన 1993 లో మరణించారు. ఈ విషయాన్ని పీపుల్స్ మ్యాగజైన్ లో తెలియచేసారు.

డబ్బై సంవత్సరాల రాబర్ట్ డీ నీరో... 'రిమంబరింగ్ ఆర్టిస్టు :రాబర్ట్ డీ నీరో సార్', అనే హెబిఓ డాక్యుమెంటరీ లో ఈ విషయాలన్నీ చర్చించబోతున్నారు. ఈ డాక్యుమెంటరీ ఈ రోజు అంటే జూన్ 9 న ప్రసారం అవుతోంది. " నా పిల్లలు తమ తాత ఎలా జీవించాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా కుటుంబం కోసం ," అని చెప్పుకొచ్చారు.
తన ఐదు దశాబ్దాల నటనా అనుభవం, తండ్రిగా తన జీవితం, కుటుంబం గురించి పలు విషయాలు ఈ డాక్యుమెంటరీలో చర్చించనున్నారు. గతం గుర్తు చేసుకోవటం యొక్క ప్రాముఖ్యత తనకు చాలా బాగా తెలుసు అని అన్నారు. అలాగే తను తన కుటుంబ విషయాలు తన పిల్లల కోసం కూడా ఇందులో పొందు పరిచానన్నారు.


Click it and Unblock the Notifications











