వారి సుఖం కంటే నాకు ఏది ముఖ్యం కాదు
హాలీవుడ్ సింగర్, పాప్ స్టార్ బ్రిట్నీస్పియర్స్ ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ తన యొక్క ప్రయివేట్ జీవితాన్ని సాధ్యమైనంత వరకు పబ్లిక్‌కి దూరంగా ఉంచాలని కొరుకుంటుందని తెలిపారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్లే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా బ్రిట్ని స్పియర్స్ తన కుమారులు సీన్ ప్రెట్నన్(5), జేడన్ జేమ్స్(4) ఇద్దరిని కూడా సాధ్యమైనంత వరకు మీడియాకు దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తుంది.
బ్రిట్ని మా ఇద్దరి కుమారులపై ఎల్లప్పుడూ తప్పనిసరిగా ఒక కన్ను వేసి ఉంచడం జరుగుతుందని అన్నారు. వారు గనుక ఏదైనా పని చేయాలని అనుకున్నప్పడు అది మంచి పని ఐతే బాగా ఎంకరేజ్ చేయడం లేకపోతే వారికి ఆపని వల్ల వచ్చే నష్టాలను మాత్రం తెలియజేస్తానని అన్నారు. దానికి కారణం కుమారుల ఎదుగదలను చూసి మనం ఎల్లప్పుడూ సంతోషించాలనే గానీ, అలా ఎందుకు చేశావ్, ఇలా ఎందుకు చేశావ్ అని ప్రశ్నించకూడదని అన్నారు. చివరగా మాట్లాడుతూ మా పిల్లలు ఆనందంగా ఉంటే అదే పదివేలని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











