అద్బుతమైన రొమాన్స్ చేయాలంటే స్నేహం అవసరం: కిమ్
లండన్, జులై 6: సోషయోలైట్ కిమ్ కర్దాషియాన్ ప్రస్తుతం రాపర్ కేన్ వెస్ట్‌తో సహాజీవనం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఐతే రాపర్ కేన్ వెస్ట్‌తో నా సంబంధం పదిలంగా ఉంటుందని, అందుకు కారణం రొమాన్స్ చేయడానికి ముందే మేమిద్దరం ధృడమైన స్నేహా బంధాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. దీంతో మా ఇద్దరి మధ్య ఎటువంటి పొరపొచ్చాలు రావని అన్నారు. కిమ్ కర్దాషియాన్ తన మాజీ భర్త బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత కేన్ వెస్ట్‌తో డేటింగ్ చేస్తున్నారు.
క్రిస్ హాంప్రస్‌ని పెళ్లి చేసుకోవడానికి ముందే కొన్ని సంవత్సరాలుగా కేన్ వెస్ట్, కిమ్‌కి మధ్య మంచి స్నేహా సంబంధాలున్నాయని.. మా ఇద్దరి మధ్య రొమాన్స్ చక్కగా ఉండేందుకు ఈ స్నేహాం అనుకూలిస్తుందని పేర్కొంది. మా ఇద్దరి గురించి మాకు బాగా తెలుసు. ఇద్దరి మనుషుల మధ్య మంచి రిలేషన్‌షిప్ కొనసాగాలంటే స్నేహం ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని తెలిపింది.
ప్రేమించి పెళ్లి చేసుకోని 72 రోజులు గడవక ముందే భర్త నచ్చలేదంటూ విడాకులు తీసుకున్న కిమ్ కర్దాషియాన్.. గత మూడు నెలలుగా సింగర్ కేన్ వెస్ట్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కిమ్, కేన్ వెస్ట్ వారికి సంబంధిత గృహాలను మార్కెట్లో వేలానికి పెట్టి, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహాజీవనం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ఇద్దరూ లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తమ తమ ఇళ్లను వేలానికి మార్కెట్లో పెట్టి, ఇద్దరూ కలిసి ఓ అందమైన ఇంటి కోసం వెతుకులాట ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి పయనించడానికి, సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. వారు అనుకున్నట్లు పనులన్నీ వేగంగా జరిగితే త్వరలోనే కిమ్ మరియు కేన్ వెస్ట్ కలిసి ఒక కొత్త ఇల్లు అద్దెకు తీసుకుంటారని కిమ్ అధికార ప్రతినిధి తెలిపారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











