ఆస్కార్ విన్నింగ్ 'గ్రావిటీ' కథ అలా పుట్టింది
లాస్‌ఏంజిల్స్ : 86వ ఆస్కార్ పురస్కారాల వేడుకలో ఈ సారి గ్రావిటీ చిత్రానికి అవార్డుల పంట పండింది. జార్జ్ క్లూనీ, శాండ్రా బుల్లక్ నటించిన ఈ చిత్రం ఏకంగా ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో చిత్రం కథ ఆలోచన తనకి ఎలా వచ్చింది అనే దానిపై దర్శకుడు అల్ఫాన్సో మాట్లాడారు. తన తనయుడు జొనాస్ క్యూరోన్ సూచనపై 'గ్రావిటీ' రచన చేసి,విజయం సాధించానన్నారు.
అల్ఫాన్సో మాట్లాడుతూ... ''ఒక రోజు నా కొడుకు నా దగ్గరకి వచ్చాడు. ఎప్పుడూ పాతబడిన కథలతోనే సినిమాలు ఎందుకు తీయడం? అవే మళ్లీ మళ్లీ తియ్యడానికి నీకెలా మనసొప్పుతుంది? అని అడిగాడు. ఎలాంటిది తీస్తే బాగుంటుందని అడిగితే, ఏదైనా కొత్తగా ఆలోచించు. భవిష్యత్తు గురించి, అప్పటికి మారిపోయే సాంకేతిక పరిజ్ఞానం గురించి తీయవచ్చు కదా అని సూచించాడు. దానికి నేను నా సెల్‌ఫోన్‌ను వాడ్డమే నాకు సరిగా తెలీదు, ఇక సాంకేతికత గురించి ఏం తీయగలను. కాబట్టి నువ్వు కూడా సహకరిస్తే ఇద్దరం కలిసి కథ రాద్దాం అన్నాను. అలా సిద్ధం చేసుకున్న కథే 'గ్రావిటీ'' అంటూ చెప్పుకొచ్చాడు అల్ఫాన్సో.
ఈయన కొడుకు 30 ఏళ్ల జొనాస్ క్యూరోన్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగానే ఎదుగుతున్నాడు. చిత్ర రంగానికి సంబంధించిన అన్ని రకాల సాంకేతిక అంశాలపైనా పట్టు సాధించాడు. డాక్యుమెంటరీ, షార్ట్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందాడు.

అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రం నేపధ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఆల్‌ఫోన్సో కారోన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం ఆల్ ఫోన్సో సుమారు నాలుగున్నర సంవ త్సరాలు శ్రమించారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంబంధించి వినియో గించిన టెక్నాలజీ ప్రతి ఒక్కరిని మంత్రముగ్గులను చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తలెత్తే పలు సమస్యలను ఇద్దరు వ్యోమగామలు ఎలా అధిగమించగలిగారు అనే అంశాలను దర్శకుడు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స అనుభూతులతో చూపించటం జరిగింది. ఈ 3డీ స్పేస్ థ్రిల్లర్ మీకు ఆకాశంలో ఉన్న అనుభూతులను చేరువ చేసింది.


Click it and Unblock the Notifications











